Sarkaru Vaari Paata : 'సర్కారు వారి పాట'లో మరో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ భామ..!

Sarkaru Vaari Paata : గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట.. మహేష్ కి ఇది 27వ చిత్రం కావడం విశేషం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. కరోనా వలన పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజున (మే 12న) భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు జిఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. అయితే ఈ సినిమా ద్వారా ఓ మలయాళీ హీరోయిన్ టాలీవుడ్ కి పరిచయం అయింది. ఆమె పేరు సౌమ్య మీనన్.. నిధి అగర్వాల్ పోలికలు ఎక్కువగా ఈమెలో కనిపిస్తూ ఉంటాయి. ట్రైలర్ లో కూడా ఈమె కనిపించింది.
మలయాళంలో అరడజను సినిమాలలో నటించిన సౌమ్య కన్నడలో హంటర్ అనే ఒక కన్నడ సినిమాలో కూడా నటించింది. తెలుగులో టాక్సీ అనే ఓ సినిమాకి ముందుగా సైన్ చేసింది.. కానీ ఇంకా ఈ మూవీ రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ మూవీతోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు కూడా సౌమ్యనే కావడం విశేషం. ఇక సౌమ్య మంచి నటి మాత్రమే కాదండోయ్... మంచి డాన్సర్ కూడా.. మరి ఈ సినిమాలో ఆమె పాత్రకి ఎలాంటి పేరు వస్తుందో చూడాలి మరి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com