Sreeleela : నవీన్ పోలిశెట్టితో పెళ్లిసందడి బ్యూటీ.. !

Sreeleela :   నవీన్ పోలిశెట్టితో పెళ్లిసందడి బ్యూటీ.. !
Sreeleela : శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్‌‌కు హీరోయిన్‌‌గా పరిచయమైంది శ్రీలీల.

Sreeleela : శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్‌‌కు హీరోయిన్‌‌గా పరిచయమైంది శ్రీలీల.. మొదటి సినిమాతోనే అటు గ్లామర్ షోతోనూ, ఇటు యాక్టింగ్ తో అదరగొట్టి మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ.. ఇప్పుడీ అమ్ముడుకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అందులో భాగంగానే నవీన్ పోలిశెట్టి హీరోగా కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో 'అనగనగా ఒక రాజు' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి అనే కాన్సెప్ట్‌‌తో రూపొందుతున్న ఈ చిత్రం చాలా ఫన్నీగా ఉంటోందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌‌‌గా శ్రీలీలని మేకర్స్ ఎంపిక చేసినట్టుగా సమాచారం. దీనిపైన త్వరలోనే అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇక రవితేజ హీరోగా త్రీనాధరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ధమాకా సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్‌‌గా ఎంపిక అయినట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story