Actress Tabu: పెళ్లి, పిల్లలు.. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్

Tabu: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఇండస్ట్రీలో కొందరున్నారు.. వాళ్లు కనిపిస్తే చాలు పెళ్లెప్పుడు అని అడగడం మొదలు పెడతారు.50 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదని సీనియర్ నటి టబుకి కూడా ఓ ప్రశ్న ఎదురైంది ఓ ప్రెస్‌మీట్‌లో. నాక్కూడా తల్లినవ్వాలని ఉంది. అయితే దీనికి పెళ్లితో పనేముంది.
సరోగసీ ద్వారా కూడా తల్లినయ్యే అవకాశం ఉంది. పెళ్లి కాకపోయినా, తల్లి కాకపోయినా జీవితం ఏం ఆగిపోదు. ప్రస్తుతం నా కెరీర్‌లో నేను బిజీగా ఉన్నా. నా వృత్తిని ఎంజాయ్ చేస్తున్నా. పెళ్లికి, పిల్లలకి వయసుతో సంబంధం లేదు. మనసుకి నచ్చినవాడు దొరికితే నేను కూడా పెళ్లి చేసుకుంటా..మహిళలను గౌరవించేవాడు దొరికితే పెళ్లి చేసుకుంటానని టబు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం టబు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com