బ్యాడ్‌లక్.. మెగాస్టార్‌ని మిస్సైన హీరోయిన్లు..!

ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం వచ్చిందంటే.. కానీ కొందరు తారామణులు ఆ అవకాశాన్ని చేజార్చుకున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా తల్చుకుని బాధపడుతుంటారు. 80వ దశకంలో ఆయనదే హవా. డ్యాన్సులు, ఫైట్లు, పాటలు.. అన్నీ హంగులు మేళవించిన మెగాస్టార్ మూవీ వస్తుందంటే థియేటర్లు షేక్ అయ్యేవి.
బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యేవి. అలాంటి స్టార్ హీరోతో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా ఎలా కాదనగలదు. కానీ.. బ్యాడ్‌లక్ ఆ అవకాశాన్ని మిస్సయ్యామని బాధపడుతుంటారు నాటీ నటీమణులు.. మరి వాళ్లెవరో తెలుసుకుందాం.
రజని.. రాజేంద్ర ప్రసాద్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలందరి పక్కన నటించింది. చిరంజీవి చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ మధ్యవర్తులు తన వరకు రానివ్వకుండా చేశారని వాపోతుంటుంది.
అశ్విని.. చంద్రమోహన్, బాలకృష్ణ, రాజశేఖర్, రాజేంద్రప్రసాద్, మోహన్ బాబులతో కలిసి నటించింది. ఒకసారి బాలకృష్ణతో భానుమతి గారి మొగుడు చిత్రంలో నటిస్తున్నప్పుడు చిరంజీవితో నటించే అవకాశం వచ్చినా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో చిరంజీవితో నటించే అవకాశాన్ని మిస్ చేసుకుంది.
ఆమని.. ఇక 90వ దశకంలో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమని.. కృష్ణ, బాలకృష్ణ, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్ వంటి హీరోలతో నటించినప్పటికీ చిరంజీవితో నటించే అవకాశాన్ని పోగొట్టుకుంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రిక్షావోడు చిత్రంలో సౌందర్యతో పాటు ఆమనిని కూడా అనుకున్నప్పటికీ నిర్మాతలు ఆ విషయాన్ని దాచిపెట్టి ఆమె ప్లేస్‌లో నగ్మాను పెట్టారు.
ఇంద్రజ.. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల చిత్రంలో అలీ, ఇంద్రజ హీరోహీరోయిన్లు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్, నాగార్జున, బాలకృష్ణతో పెద్దన్నయ్య చిత్రంలో నటిస్తున్నప్పుడు చిరంజీవితో చేసే అవకాశం వచ్చినప్పటికీ డేట్స్ కుదరక చిరుతో నటించే అవకాశాన్ని కోల్పోయింది.
రాశి.. 'శుభాకాంక్షలు' సినిమాలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాశి.. శ్రీకాంత్, జగపతిబాబు, మోహన్ బాబు, రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్, బాలకృష్ణ వంటి హీరోలతో కలిసి నటించారు. 'మనసంతా నువ్వే' చిత్రంతో హిట్ కొట్టిన దర్శకుడు వి.ఎన్.ఆదిత్య. ఆయన దర్శకత్వంలో చిరంజీవి, రాశి హీరోహీరోయిన్లుగా సినిమా వస్తున్నట్లు ప్రకటన వచ్చింది. కానీ ఆ ప్రయత్నం మధ్యలోనే విరమించుకుంది చిత్ర యూనిట్. అయితే ఆ తరువాత రాశి, పవన్ కళ్యాణ్‌తో 'సుస్వాగతం'లో నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com