సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ పై క్యూరియాసిటీ పెంచుతోన్నఅదా శర్మ

ఇటీవలే 'ది కేరళ స్టోరీ' అనే సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న హీరోయిన్ అదా శర్మ.. ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీకి 'C.D.. క్రిమినల్ ఆర్ డెవిల్' అనే టైటిల్ ను మేకర్స్ ఇప్పటికే ఖరారు చేశారు. ఆడియన్స్‌కి డిఫరెంట్ అనుభూతి కలిగించే స్టోరీతో దర్శకుడు కృష్ణ అన్నం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీలో అదా లీడ్ రోల్ పోషిస్తుండడం చెప్పుకోదగిన విషయం.
'క్రిమినల్ ఆర్ డెవిల్' అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు SSCM ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా గిరిధర్ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. RR ధృవన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అదా శర్మ సీరియస్ లుక్ లో కనిపిస్తోంది. ఆమె చుట్టూ డెవిల్స్ హ్యాండ్స్ కనిపిస్తుండటం చిత్రంలోని వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. 'C.D' అనే టైటిల్ క్రిమినల్ ఆర్ డెవిల్ అనే ట్యాగ్ లైన్‌తో పోస్టర్ చూడగానే సినిమాపై ఆసక్తి నెలకొనేలా ఈ ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడంలో కొత్త దారిలో వెళుతున్నాం అని మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. మొత్తంగా అయితే ఈ 'C.D' ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచిందనే చెప్పుకోవచ్చు.
ఈ మూవీలో రీసెంట్ సెన్సేషన్ అదా శర్మ కీలక పాత్ర పోషిస్తుండగా.. విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏ.ముద్దు కృష్ణ డైలాగ్స్ అందించగా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. సత్య గిడుతూరి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. చిత్రానికి సంబంధించిన అన్ని పనులు ఫినిష్ చేసి అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మేకర్స్ చెప్పారు.
After the sensational #TheKeralaStory, @adah_sharma is coming up with a psychological horror thriller #CD #CriminalOrDevil
— BA Raju's Team (@baraju_SuperHit) August 18, 2023
Here’s the creepy and petrifying first look@mynameisviswant@sscmproductions@krishnaAnnam312 #AMuddaKrishna#RRDhruvan #SatyaGiduturi#RamaKrishna… pic.twitter.com/UplGVOpg1l
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com