బీచ్ ఒడ్డున బ్యూటీ.. 'నాంచాక్' చేస్తున్న అదాశర్మ..

పూరీ జగన్నాథ్ 'హార్ట్ ఎటాక్' సినిమాతో యువ హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్ అదాశర్మ.. అవకాశాలు అంతగా రాకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అడపా దడపా బాలీవుడ్‌లో అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది ఈ భామ. అందాల ముద్దుగుమ్మ అదాకు వివిధ రకాల వర్కవుట్ప్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆ మధ్య బీచ్ ఒడ్డున చీరకట్టి పల్టీలు కొడుతూ చేసిన వీడియో వైరల్ అయింది.
తాజాగా మరో విన్యాసంతో మనముందుకొచ్చింది. ఇప్పుడు నాంచాక్ చేస్తూ వావ్ అదా అనేలా చేస్తోంది. సముద్రం ఒడ్డున ఎగసి పడే అలల మధ్య వైట్ డ్రస్‌లో మెరిసి పోతూ నాంచాక్ తిప్పుతోంది. అత్యంత వేగంగా ఆమె చేస్తున్న ఫీట్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. భలే అందగా ఉంది అదా అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com