Aadasharma : తప్పుగా ప్రవర్తిస్తే వెంటనే రియాక్ట్ కావాలి : ఆదాశర్మ
‘హార్ట్ ఎటాక్’ మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఆదాశర్మ.. సన్నాఫ్ సత్యమూర్తి,క్షణం, కల్కి సినిమాల్లో నటించింది. గతేడాది రిలీజైన ‘కేరళ స్టోరీ’.. ఈ ఏడాది వచ్చిన ‘బస్తర్’ సినిమాలు ఆదాశర్మకు నేషనల్ వైడ్ గా గుర్తింపును తీసుకొచ్చాయి. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి, తనకు ఎదురైన అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆదాశర్మ పంచుకుంది. ‘మనం సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల్లో నటించేటప్పుడు ఎంత వేగంగా రెస్పాండ్ అవుతామో.. ఎవరైనా మనతో తప్పుగా ప్రవర్తించాలని చూస్తే అంతే వేగంగా కనిపెట్టాలి. ఆ సమయంలో మనం ఏం చేయాలనేదానిపైనే ఫోకస్ పెట్టాలి. పక్కవారి అభిప్రాయాలను తీసుకోకూడదు. ఏ రంగంలోనైనా సపోర్ట్ నెట్‌వర్క్ కలిగి ఉండడం ముఖ్యం. నాకు మద్దతు ఇచ్చేవారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నందుకు సంతోషిస్తున్నాను’ అని ఆదాశర్మ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆదాశర్మ ‘ది గేమ్ ఆఫ్ గిర్గిత్’మూవీలో యాక్ట్ చేసింది. తొందరలోనే ఆ సినిమా రిలీజ్ కానుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com