Adhi Pinisetti : జీవితం చావుతో అంతం అవదు - శబ్ధం ట్రైలర్

Adhi Pinisetti :  జీవితం చావుతో అంతం అవదు - శబ్ధం ట్రైలర్
X

ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శబ్ధం’. ఇంతకు ముందు అతనితోనే వైశాలి అనే మూవీ రూపొందించిన దర్శకుడు అరివళగన్ రూపొందించిన సినిమా ఇది. వైశాలిలో నీరుని బేస్ చేసుకుని తీశాడు అరివళగన్. ఈ సారి సౌండ్ ను బేస్ గా తీసుకున్నాడు. రెండు సినిమాలూ పారానార్మల్ స్టోరీస్ అనేది లేటెస్ట్ గా విడుదలైన ఈ శబ్ధం ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఆది పినిశెట్టి దెయ్యాల ఉనికిని చాటే శబ్ధాలను రికార్డ్ చేసి వాటిని నిర్ధారించే వ్యక్తి పాత్రలో కనిపిస్తున్నాడు. అతని పాత్ర పేరు ‘వ్యామో’.

ఒక అమ్మాయి తన చెవిలో ఒకేసారి వెయ్యి గబ్బిలాలు అరుస్తున్నట్టుగా ఉంది అని చెప్పడంతో ప్రారంభమైన ట్రైలర్ హీరోయిన్ లక్ష్మీ మీనన్ అనుమానాలతో స్టార్ట్ అయ్యి ఆమెనే దెయ్యం ఆవహించినట్టుగా కనిపించే సన్నివేశాలతో సాగుతూ.. దెయ్యాలు లేవని వ్యామోతో వాదించిన వ్యక్తిని .. నీ సైన్స్, నా నమ్మకం నిజం కాబోతున్నాయి అని ఆది చెప్పే డైలాగ్ నుంచి ఒక విధ్వంసం వైపుగా సినిమా వెళుతోందా అన్నట్టుగా ఉందీ ట్రైలర్. ఎక్కడా దెయ్యం నేరుగా కనిపించలేదు. కానీ తన ఉనికిని బలంగా చాటేలా శబ్ధాలు వినిపించేలా దర్శకుడు ఈ కథనం రాసుకున్నాడేమో అనిపిస్తోంది.

2023లోనే పూర్తయిన ఈ చిత్రాన్ని కారణాంతరాల వల్ల ఈ నెల 28న విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. విశేషం ఏంటంటే.. ఈ పారానార్మల్ సినిమాకు థమన్ సంగీతం అందించాడు. ట్రైలర్ చూస్తే అది హైలెట్ కాబోతున్నట్టు కనిపిస్తోంది.

ఆదితో పాటు మనకు కొన్ని డబ్బింగ్ సినిమాల ద్వారా పరిచయమైన లక్ష్మీ మీనన్, కింగ్ స్లే, ఎమ్ఎస్ భాస్కర్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మొత్తంగా చాలా రోజుల తర్వాత హీరోగా నటించిన ఆది పినిశెట్టికి ఈ శబ్ధం కెరీర్ లో మరింత సౌండ్ వినిపించేలా చేసేలానే ఉంది. మరి చేస్తుందా లేదా అనేది ఈ నెల 28న తేలిపోతుంది.

Tags

Next Story