Siddharth Wedding : సిద్ధార్థ్ తో పెళ్లి.. అక్కడే చేసుకుంటామన్న అదితిరావు

‘ప్రజాపతి’అనే మలయాళ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హైదరాబాదీ బ్యూటీ అదితిరావు హైదరీ. ఆ తర్వాత బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టింది. అభిషేక్ బచ్చన్ నటించిన ‘ఢిల్లీ6’తో బీటౌన్ లోకి అడుగుపెట్టింది. రాక్ స్టార్, వాజిర్,పద్మావత్ సినిమాలతో అలరించింది. కోలీవుడ్ లో కాట్రు వెలియాడై, చెక్క చివంత వానం, సైకో, తెలుగులో సమ్మోహనం, ‘వీ’, మహాసముద్రం సినిమాల్లో నటించి మెప్పించింది. తాజాగా వెబ్ సిరీస్ లవైపు ఫోకస్ చేసిన అదితీరావు.. ‘హీరామండి’తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. హీరామండిలో ఆమె డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ గా మారింది. కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ తో అదితీ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరిగింది. లవ్, వెడ్డింగ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను అదితీ షేర్ చేసుకుంది. ‘మా నాన్నమ్మ అంటే నాకెంతో ఇష్టం. హైదరాబాద్‌లో ఆమె ఒక స్కూల్ ప్రారంభించారు. అది నాకెంతో ప్రత్యేకం. నా చిన్నప్పటి రోజులు అక్కడే ఎక్కువగా గడిపా. కొన్నేళ్లక్రితం ఆమె కన్నుమూశారు. ఈ విషయం సిద్ధార్థ్‌కు తెలుసు. ఓ రోజు నా వద్దకువచ్చి.. ఆ స్కూల్‌కు తీసుకువెళ్లమని అడిగాడు. మార్చిలో మేమిద్దరం అక్కడికి వెళ్లాం. మోకాళ్లపై కూర్చొని.. అతను నాకు ప్రపోజ్ చేశాడు. ఆమె ఆశీస్సుల కోసమే తాను అక్కడ ప్రపోజ్ చేసినట్లు చెప్పాడు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయం మా కుటుంబానికి ఎంతో స్పెషల్. మా ఎంగేజ్ మెంట్ అక్కడే జరిగింది. పెళ్లి కూడా అక్కడే ఉంటుంది. వెడ్డింగ్ డేట్ ఫిక్స్ అయ్యాక మేమిద్దరం అనౌన్స్ చేస్తాం’ అని అదితీ చెప్పుకొచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com