Balakrishna : ఆదిత్య 369 రీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది

Balakrishna :  ఆదిత్య 369 రీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది
X

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ఆదిత్య 369. సింగీతం శ్రీనివాసరావు క్రియేట్ చేసిన ఈ క్లాసిక్ మూవీని ఎప్పుడు చూసినా ఫ్రెష్ మూవీ అనే ఫీలింగ్ కలుగుతుంది. 1999 ఆగస్ట్ 19న విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. సింగీతం విజువల్ ఇమాజినేషన్ కు ప్రేక్షక లోకం దాసోహం అయింది. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో సాగే ఈ కథను ఓ గొప్ప విజన్ తో రూపొందించాడు సింగీతం.

టైమ్ మెషీన్ లో అనుకోకుండా ఎక్కిన హీరో హీరోయిన్ తో పాటు ఓ కానిస్టేబుల్ తెలియకుండా నొక్కిన బటన్స్ వల్ల శ్రీ కృష్ణ దేవరాయల కాలానికి వెళ్లడం.. అక్కడ రాయల వారి వైభవాలను అద్భుతంగా చూపించాడు సింగీతం. అలాగే భవిష్యత్ కాలంలో ప్రపంచం ఎంత దారుణంగా మారుతుంది అనేది ఎంటర్టైనింగ్ గా చెప్పాడు. అందుకే ఇది ఏజ్ తో పనిలేకుండా అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంది. అలాంటి మూవీ మళ్లీ రిలీజ్ అవుతుందంటే అప్పుడు చూసిన చిన్నపిల్లలు మరోసారి చిన్నవాళ్లైపోతారు.. ఇప్పుడు చూడాలనుకునేవాళ్లు మరింత హ్యాపీగా ఫీలవుతారు. కొన్నాళ్ల క్రితమే ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నాం అని ప్రకటించారు. ఏప్రిల్ 11న ఆదిత్య 369 ను రీ రిలీజ్ చేయబోతున్నాం అని అనౌన్స్ చేశారు.

ఇప్పుడు 4 కే టెక్నాలజీతో వస్తుంది కాబట్టి మరింత అందంగా కనిపిస్తుంది. బాలయ్య సరసన మోహిని హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సిల్క్ స్మిత, అమ్రిష్ పురి, టినూ ఆనంద్, మాస్టర్ తరుణ్, జేవీ సోమయాజులు, సుత్తివేలు, లక్ష్మి తదితరులు నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన సంగీతం హైలెట్ గా నిలిచింది.

Tags

Next Story