Major Review : హృదయానికి హత్తుకునే 'మేజర్'

Major Review : హృదయానికి హత్తుకునే మేజర్
Major Review : అడవి శేష్ లేటెస్ట్ మూవీ 'మేజర్'.. 26/11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన రియల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

Major Review : అడవి శేష్ లేటెస్ట్ మూవీ 'మేజర్'.. 26/11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన రియల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్ సినిమా పైన అంచనాలు పెంచేశాయి. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. తాజాగా ఈ సినిమాను 10 రోజుల ముందుగా 9 మేజర్ నగరాల్లో ప్రీ రిలీజ్ స్పెషల్ స్క్రీనింగ్‌లో ఈ సినిమాను ముందుగానే ప్రదర్శిస్తున్నారు.

అయితే అన్ని ఏరియాల్లో ఒక్కసారి కాకుండా.. ఒక్కో నగరంలో ఒక్కో రోజు స్పెషల్ ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. జైపూర్‌లో ఈ సినిమా ప్రివ్యూ షో ప్రదర్శించగా దాదాపుగా వంద మందికి పైగా జవాన్లు మూవీ చూసేందుకు వచ్చారు. సినిమాని చూసిన వారు కంటతడి పెట్టుకున్నారు. మూవీని చూసిన అనంతరం ఉన్నికృష్ణన్ నివాళిగా స్టాండ్ ఒవేషన్ ఇచ్చారు. సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడవి శేష్ ఒదిగిపోయాడు. ఆర్మీ జవాన్ గా, ఓ అమ్మాయిని ప్రేమించే యువకుడి పాత్రలో వేరియేషన్ చూపించాడు. క్లైమాక్స్ లో అతని నటన కన్నీళ్లు పెట్టిస్తుంది.

అటు హీరోయిన్ శోభిత తన పాత్రలో అద్భుతంగా నటించింది. సందీప్ తల్లితండ్రులుగా నటించిన ప్రకాష్ రాజ్, రేవతి తమ పాత్రలకి జీవం పోశారు. వీరి పాత్ర ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇక సాంకేతిక విభాగానికి వస్తే అబ్బూరి రవి డైలాగ్‌లు, శ్రీచరణ్ పాకాల సంగీతం బాగా వర్కౌట్ అయ్యాయి. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా సెకండ్ హాఫ్ లో హృదయానికి హత్తుకునే సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story