Adivi Sesh : కరోనా వల్ల థియేటర్లకు వెళ్లలేకపోతున్నా.. నాకోసం ఆ రెండు సినిమాలు చూసెయ్యండి : అడివి శేష్

Adivi Sesh : అడివి శేష్ మేజర్ సినిమా తరువాత వెంటనే హిట్ 2 సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఆయనకు కరోనా సోకడంతో ఐసొలేషన్‌లో ఉన్నారు. ఈ రోజు రిలీజ్ అయిన రెండు పెద్ద సినిమాలు బింబిసార్, సీతారమం చిత్రాలను చూడమని తన అభిమానులకు సలహా ఇచ్చారు. "బింబిసార, సీతారమం.. ఈ రెండింటికీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. వెంటనే ఈ రెండు సినిమాలను మార్నింగ్ షో ఒకటి, మ్యాట్నీ ఒకటి నాకోసం చూసేయ్యండి అని అన్నారు.
కరోనా వల్ల థియేటర్లకు వెళ్లలేకపోతున్నానని తన స్నేహితులు నటించిన మూవీని తప్పకుండా చూడాలని కోరారు. అడవి శేష్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. 'అడవిశేష్ అన్న గెట్ వెల్ సూన్ అన్న' అని ట్వీట్ చేస్తున్నారు. మేజర్ సినిమాతో అడవిశేష్ బాలీవుడ్‌లోనూ మంచి పేరు సంపాదించుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com