Adivi Sesh : అడివి శేష్ నెక్ట్స్ మూవీ కన్ఫార్మ్

Adivi Sesh :  అడివి శేష్ నెక్ట్స్ మూవీ కన్ఫార్మ్
X

అడివి శేష్ హీరోగా చేస్తున్న సినిమాలన్నీ ఓ రేంజ్ లో వర్కవుట్ అవుతున్నాయి. కాకపోతే మాగ్జిమం ఒకే జానర్ లో ఉంటున్నాయి. అయినా ఆ మూవీస్ అన్నీ కమర్షియల్ గా పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. ఫస్ట్ టైమ్ తన జానర్ మార్చాడు. డెకాయిట్ అన్నాడు. ఈ మూవీ మరికొన్ని గంటల్లో విడుదల కాబోతోంది. ఎలాగూ ఈ మూవీ కూడా భారీ విజయం సాధిస్తుందని అనే నమ్ముతున్నారు మొత్తం టీమ్. ఆ తర్వాత గూఢచారి 2 ఉండబోతోంది. నిజానికి గూఢచారి 2 కూడా మాగ్జిమం షూటింగ్ అయిపోయింది. ఇది కూడా ఈ యేడాదే విడుదల కాబోతోంది. ముందు డెకాయిట్ కు సంబంధించిన పనులన్నీ పూర్తి అయితే.. గూఢచారి 2 లైన్ లోకి వస్తుంది. గూఢచారి 2 తర్వాత ఏంటీ అనేది ఇప్పటి వరకు తెలియదు అనుకున్నారు చాలామంది. బట్ అలాంటిదేం లేదు. గూఢచారి 2 తర్వాత అడివి శేష్ చేయబోతున్న సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. అది కూడా డెకాయిట్ మూవీ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

డెకాయిట్, గూఢచారి 2 తర్వాత అడివి శేష్ చేయబోతున్న సినిమా దర్శకుడు రాహుల్ రవీంద్రన్. యస్.. రాహుల్ రవీంద్రన్ రీసెంట్ గా ద గర్ల్ ఫ్రెండ్ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రానికి బెస్ట్ యాక్ట్రెస్ గా రష్మిక మందన్నాకు గద్దర్ అవార్డ్ కూడా వచ్చింది. అలాంటి రాహుల్ తో శేష్ మూవీ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో ఇద్దరూ చెప్పారు. ఆ మూవీకి కథ పూర్తిగా సిద్ధమైంది అని.. టైటిల్ ఇంకా రిజిస్టర్ చేయలేదు అని చెప్పాడు రాహుల్. అలాగే గూఢచారి 2 తర్వాత ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుందని కూడా చెప్పాడు. కాకపోతే శేష్ స్టైల్ కి రాహుల్ స్టైల్ పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అలాంటిది ఈ ఇద్దరి కాంబోలో మూవీ అంటే ఖచ్చితంగా కొత్తదనం ఉంటుందని మాత్రం ఊహించొచ్చు.

Tags

Next Story