ANR Movie: 82 లో తీసిన ఏఎన్నార్ చిత్రం.. ఈ రోజు 250 థియేటర్లలో..

ANR Movie: 82 లో తీసిన ఏఎన్నార్ చిత్రం.. ఈ రోజు 250 థియేటర్లలో..
X
ANR Movie: నాలుగేళ్లు కాదు.. నలభై ఏళ్లు.. మీరు చదివింది నిజమే.. ఆ చిత్రం తీసి 40 ఏళ్లయింది.

ANR Movie: నాలుగేళ్లు కాదు.. నలభై ఏళ్లు.. మీరు చదివింది నిజమే.. ఆ చిత్రం తీసి 40 ఏళ్లయింది. ఇప్పటి వరకు విడుదల కాకపోవడానికి అనేక కారణాలు. ఏది ఏమైతేనేం అక్కినేని నాగేశ్వర్రావు, జయసుధ నటించిన 'ప్రతిబింబాలు' చిత్రం ఈ రోజు 250 థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించబోతోంది.

కె.యస్.ప్రకాశ్‌రావు దర్శకత్వంలో రూపుతదిద్దుకున్న ఈ చిత్రానికి జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. అక్కినేని ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇది. 1982లో షూటింగ్ మొదలు పెట్టారు. ఆ సమయంలో నాగేశ్వర్రావుకి గుండెపోటు రావడంతో చికిత్స కోసం అమెరికా వెళ్లారు.

ఆ తర్వాత రెండేళ్లకు సినిమా పూర్తి చేద్దామని ఏఎన్నార్ ముందుకొచ్చినా పలు కారణాలతో సాధ్యం కాలేదు. మళ్లీ ఆయనే దర్శకుడుని పిలిచి సినిమా పూర్తి చేయించారు. అయినా కొన్ని ఆర్థికపరమైన కారణాలతో విడుదల వాయిదా పడింది. అప్పటి నుంచి ఈ సినిమా విడుదల చేయాలని ఎంత పోరాటం చేసినా సాధ్యం కాలేదు. ఇప్పటికి ముడిపడింది అని జాగర్లమూడి అన్నారు.

Tags

Next Story