అల్లు అర్జున్ తర్వాత ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తున్నారా

అల్లు అర్జున్ తర్వాత ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తున్నారా
X

2024 టాలీవుడ్ హిస్టరీలోనే ఓ బ్లాక్ ఇయర్ కాబోతోందా అంటే అవుననే అనాలి. ఈయేడాది జరిగినన్ని కాంట్రవర్శీలు టాలీవుడ్ చరిత్రలోనే ఎప్పుడూ లేవు. మాగ్జిమం స్మూత్ గా వెళ్లిపోయే పరిశ్రమ ఇది. అలాంటి ఇండస్ట్రీలో సంక్రాంతి నుంచే స్టార్ట్ అయిన కాంట్రవర్శీస్ డిసెంబర్ ను కూడా దాటుకుని 2025లోనూ కొనసాగబోతున్నాయి అనేలా ఉంది పరిస్థితి. ప్రస్తుతం అల్లు అర్జున్ సెంటర్ పాయింట్ గా ఉన్నాడు. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా చనిపోయిన రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం అని ప్రభుత్వమే వాదిస్తోంది. ఇప్పటికే బెయిల్ పై ఉన్న ఐకన్ స్టార్ కు ఇది అనుకోని తలనొప్పులు మరిన్ని తీసుకురాబోతోందనిపించేలా ఉన్నాయి పరిస్థితులు. ఇక అతను అయిపోయాడు నెక్ట్స్ ఎవరూ.. అంటే.. ఇదుగో ఎన్టీఆర్ అంటూ రెడీ చేస్తున్నారు కొందరు.

అల్లు అర్జున్ లాంటిది కాకపోయినా.. అసందర్భంగా ఎన్టీఆర్ ఇన్సిడెంట్ ను తెరపైకి తెస్తున్నారు కొందరు. కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ కౌశిక్ అనే అభిమాని దేవర చూసి చనిపోవాలని ఉందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయింది. అతను చెన్నై అపోలో హాస్పిటల్ లో క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటున్నాడు ఆ టైమ్ లో. దానికి రియాక్ట్ అయిన ఎన్టీఆర్ అతనితో పాటు కుటుంబంతో మాట్లాడాడు. కౌశిక్ కు ధైర్యం చెప్పాడు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని వైద్య ఖర్చులు భరిస్తా అని చెప్పాడట. కానీ ఇప్పటి వరకూ ఎన్టీఆర్ ఎలాంటి సాయం చేయలేదు అని అటు వైపు నుంచి అసలు స్పందనే లేదు అంటూ తాజాగా ఓ మీడియా సంస్థ కౌశిక్ కుటుంబంతో మాట్లాడించిన విధానం చూస్తుంటే ప్రభుత్వం టాలీవుడ్ పై పగ పట్టిందా అన్నట్టుగా కనిపిస్తోంది. నిజానికి హీరోలు ఇలాంటి మాటలు చెప్పడం కామన్. అదేం వారి బాధ్యత కాదు. కానీ బాధితుల్లో ధైర్యం నింపేందుకు కొన్నిసార్లు చెబుతారు. చాలాసార్లు మన హీరోలు సాయం చేయడం చూశాం. ఎలాగో మిస్ అయిన కౌశిక్ విషయాన్ని ఇప్పుడు కావాలని ఆ మీడియా సంస్థ హైలెట్ చేయడం చూస్తుంటే ఓ ప్లాన్ ప్రకారం ఇది జరుగుతోందా అనిపిస్తోంది.

అసలుకు మాట్లాడితే అధికారం కోసం రాజకీయ నాయకులు అనేక హామీలు ఇస్తారు. వాటిని అమలు చేయాల్సిన ‘బాధ్యత’వారిపై ఉంది. కానీ అవేం పట్టించుకోరు కదా. మరి అలాంటి వారందరినీ సదరు మీడియా సంస్థ ఇలాగే ప్రశ్నిస్తుందా అనేది చూడాలి.

Tags

Next Story