Sharwanand : శర్వా కోసం మరో బ్యూటీని తెచ్చిన సంపత్ నంది

Sharwanand  :  శర్వా కోసం మరో బ్యూటీని తెచ్చిన సంపత్ నంది
X

శర్వానంద్ హీరోగా జోరు పెంచాడు. వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు. కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం చూస్తోన్న శర్వా ఈ సారి మూడు సినిమాలతో సిద్ధం అవుతున్నాడు. ఈ మూడూ ప్రామిసింగ్ గా కనిపిస్తుండటం విశేషం. వీటిలో ముందుగా నారీ నారీ నడుమ మురారి అనే చిత్రం రాబోతోంది. సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్నాడు. నెక్ట్స్ మూవీని అభిలాష్ డైరెక్షన్ లో చేయబోతున్నాడు. ఆ తర్వాత సంపత్ నంది ప్రాజెక్ట్ ఉండబోతోంది. శర్వా కెరీర్ లోనే భారీ చిత్రంగా ఈ మూవీ రూపొందబోతోందంటున్నారు. 1960ల కాలంలో ఆదిలాబాద్, మహరాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో సాగే కథట ఇది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ కు ఈ మధ్య తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా భారీ డిమాండ్ ఉంటోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి.

ఇక రీసెంట్ గా ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నాడు. ఆల్రెడీ ఈ జోడీ శతమానం భవతి వంటి బ్లాక్ బస్టర్ లో నటించింది. కాబట్టి ఆ క్రేజ్ ఈ మూవీకి ప్లస్ అవుతుంది. అనుపమ అప్పుడప్పుడే తెలుగులో అడుగులు వేస్తోంది. ఇప్పుడు గ్లామర్ రోల్స్ కూ రెడీగా ఉంది. ఇక లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లో శర్వాకు జోడీగా మరో బ్యూటీని తీసుకున్నారు. తనే డింపుల్ హయాతి. చాలాకాలంగా ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తున్నా డింపుల్ కు ఇప్పటి వరకూ బ్రేక్ రాలేదు. చివరగా వచ్చిన గోపీచంద్ రామబాణం కూడా టార్గెట్ ను చేరలేదు. రెండేళ్ల తర్వాత ఈ ఆఫర్ రావడం అంటే పెద్ద విషయం అనే చెప్పాలి. మొత్తంగా సంపత్ నంది కూడా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలతో ఉన్నాడు. గ్యారెంటీగా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో కనిపిస్తున్నాడు.

Tags

Next Story