Suriya : సూర్యను కూడా పరిచయం చేస్తున్న సితార

డిఫరెంట్ కాంబినేషన్స్ సెట్ చేస్తూ వైవిధ్యమైన కథలతో బ్లాక్ బస్టర్స్ కొడుతోన్న సితార బ్యానర్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అయింది. మోస్ట్ టాలెంటెడ్ తమిళ్ స్టార్ సూర్య హీరోగా ఈ బ్యానర్ లో ఓ సినిమా రాబోతోంది. అంతా ఊహించినట్టుగానే ఈ చిత్రాన్ని కూడా వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయబోతున్నాడు.త్రివిక్రమ్ హారిక హాసినికి ఫిక్స్ అయినట్టు వెంకీ అట్లూరిని సితార బ్యానర్ పర్మనెంట్ చేసుకుంది. అతను రీసెంట్ గానే ఈ బ్యానర్ నుంచి దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అంతకు ముందు తమిళ్ హీరో ధనుష్ తో చేసిన 'సార్' కూడా 100 కోట్లు కలెక్ట్ చేసింది.
సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అతనూ ఎప్పటి నుంచో స్ట్రెయిట్ తెలుగు మూవీ చేయాలనుకుంటున్నాడు. ఫైనల్ గా సితార బ్యానర్ లోనే సెట్ అయింది. కొన్నాళ్లుగా సూర్య వరుసగా ఫ్లాపులు చూస్తున్నాడు. రీసెంట్ గా ప్యాన్ ఇండియా ఇమేజ్ తెస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్న కంగువా డిజాస్టర్ అయింది. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో 'రెట్రో' అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత వెట్రిమారన్ తో వాడివాసలై కూడా ఉంది. బట్ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టే టాక్ వినిపిస్తోంది. ఆ డేట్స్ నే సితార బ్యానర్ కు ఇచ్చాడు అంటున్నారు.
ఇక ఈ చిత్రంలో సూర్య సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించబోతోంది. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందంటున్నారు. మొత్తంగా సూర్యను కూడా డైరెక్ట్ తెలుగు మూవీతో దించేస్తోంది సితార బ్యానర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com