Aishwarya : ధనుష్‌తో విడాకులు.. ఇప్పుడు ఐశ్వర్య ఏం చేస్తుందంటే?

Aishwarya : కోలీవుడ్‌లో మొన్నటివరకు స్టార్ కపుల్‌గా ఓ వెలుగు వెలిగిన ధనుష్- ఐశ్వర్యలు విడాకులు తీసుకోవడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. వీరిద్దరూ విడిపోవడం అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ త్వరలోనే కలుస్తారంటూ ధనుష్ తండ్రి కస్తూరి రాజా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇదే నిజం అయితే బాగుండని అందరు కోరుకుంటున్నారు.
ధనుష్- ఐశ్వర్య విడిపోయాక వీరిద్దరి పైన నెటిజన్ల ఫోకస్ ఎక్కువైపోయింది. ప్రస్తుతం ఐశ్వర్య ఒక లవ్ సాంగ్‌ను డైరెక్ట్ చేస్తోందని కోలీవుడ్ టాక్.. ఇది వాలెంటైన్స్ డే స్పెషల్ సాంగ్ అని, ఇందులో కొంత రొమాన్స్ కూడా కలగలిపి ఉంటుందని సమాచారం. ఈ సాంగ్ షూటింగ్ హైదరాబాద్‌లో జనవరి 25 నుంచి 27 వరకు జరగనున్నట్లు తెలుస్తోంది.
అటు ధనుష్ 'సార్' మూవీ పైన ఫోకస్ చేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి తెలుగులో సార్.. తమిళంలో వాతి అని టైటిల్ పెట్టారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com