Sai Pallavi : విజయ్ బెస్ట్ డ్యాన్సర్.. మొన్న కీర్తి, నేడు సాయి పల్లవి

Sai Pallavi :  విజయ్ బెస్ట్ డ్యాన్సర్.. మొన్న కీర్తి, నేడు సాయి పల్లవి
X

సౌత్ సినిమా ఇండస్ట్రీస్ లో బెస్ట్ డ్యాన్సర్స్ చాలామందే ఉన్నారు. ముఖ్యంగా 80ల నుంచి డ్యాన్స్ లలో కొత్త ట్రెండ్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ ట్రెండ్స్ ను నెక్ట్స్ లెవల కు తీసుకువెళ్లినవాడు డౌటే లేకుండా మన మెగాస్టార్ చిరంజీవి. ఆయన డ్యాన్స్ ల్లోని గ్రేస్ కు బాలీవుడ్ సైతం ఫిదా అయిపోయింది. ఇప్పటి వరకూ మెగాస్టార్ గ్రేస్ ను మ్యాచ్ చేసే హీరోనే లేడు అనే వాదన కూడా ఉంది. బట్ ఇది అందరూ ఒప్పుకుంటారా అంటే లేదు అనే చెప్పాలి.ముఖ్యంగా ఈ జనరేషన్ లో తెలుగు నుంచి ది బెస్ట్ అనే డ్యాన్సర్స్ నలుగురైదుగురు ఉన్నారు. కోలీవుడ్ లో మాత్రం అంతా చెప్పే ఏకైక పేరు విజయ్. దళపతి విజయ్ అని ఫ్యాన్స్ ముద్దుగా చెప్పుకునే అతన్ని మించిన డ్యాన్సర్ లేడు అనేది వారి భావన. అది తెలుగు వారికి అస్సలే నచ్చదు. అందుకే ఆ మధ్య కీర్తి సురేష్ ను బెస్ట్ డ్యాన్సర్స్ గురించి అడిగినప్పుడు.. 'చిరంజీవా.. విజయ్ నా" అంటే ఏ మాత్రం తడబడకుండా విజయ్ అనేసింది. దీంతో కీర్తి సురేష్ ను విపరీతంగా ట్రోల్ చేశారు. అంతే కాదు విజయ్ కి సంబంధించిన కొన్ని మూమెంట్స్ ను కూడా సోషల్ మీడియాలో పెట్టి ఘోరంగా ట్రోల్ చేశారు.

ఇక లేటెస్ట్ గా కీర్తి సురేష్ లిస్ట్ లోకి సాయి పల్లవి కూడా చేరింది. హీరోయిన్లలో తమన్నా బెస్ట్ డ్యాన్సర్ అనేవారు. తనకంటే ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంది సాయి పల్లవి. సాయి పల్లవి డ్యాన్స్ లోనూ మంచి గ్రేస్ ఉంటుంది. బేసికల్ గానే డ్యాన్సర్ అయిన అమ్మడు అనుకోకుండా హీరోయిన్ అయింది. దీంతో డ్యాన్స్ లోనూ అదరగొడుతోంది. తను కూడా విజయ్ డ్యాన్స్ లోని గ్రేస్ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పింది తాజాగా.

సాయి పల్లవి ఏం చెప్పిందంటే.. ''ఎవరైనా డ్యాన్స్ చేస్తుంటే మనకూ అలా చేయాలనిపిస్తుంది. మనమూ వారిలా మెప్పించాలనిపిస్తుంది. నాకైతే విజయ్ సర్ పాటలన్నిటికీ డ్యాన్స్ వేయాలనిపిస్తుంది. ఆయన డ్యాన్స్ లో గ్రేస్ అంటే నాకు చాలా ఇష్టం.. '' అని చెప్పింది. అంటే ఇప్పుడు సాయి పల్లవిని కూడా ట్రోల్ చేస్తారేమో.. పనిలో పనిగా మళ్లీ విజయ్ పాత డ్యాన్స్ మూమెంట్స్ ను బయటకు తెస్తారు కూడా. ఏదేమైనా ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. అందరికీ మనలాంటి అభిప్రాయమే ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు. మనకు చిరంజీవే ది బెస్ట్ కావచ్చు.. వేరేవారికి ఇంకెవరో బెస్ట్ అనిపిస్తారు. అది వారి ఒపీనియన్. సో జస్ట్ లీవ్ ఇట్.. దట్సాల్.

Tags

Next Story