KA - Amaran : హౌస్ ఫుల్ బోర్డ్స్ తో థియేటర్స్ కళ కళ..

తెలుగు సినిమాలకు హౌస్ ఫుల్ బోర్డ్స్ కొత్తేం కాదు.ఆ మాటకొస్తే ఏ భాషా చిత్రానికైనా ఈ బోర్డ్ కొత్త కాదు. బట్ కొన్నాళ్లుగా కేవలం స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే.. పరిమితం అవుతోందీ బోర్డ్. అది కూడా వీకెండ్స్ కే పరిమితం. మరీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనే టాక్ వస్తే తప్ప వీక్ డేస్ లో ఈ హౌస్ ఫుల్ బోర్డ్స్ పడవు. అలాంటిది ఓ చిన్న హీరో సినిమా, మరో డబ్బింగ్ సినిమాకు ఫ్రైడే రోజు హౌస్ ఫుల్ బోర్డ్స్ పడటం అంటే కంటెంట్ కు ఉన్న వాల్యూ అది అని చెప్పాలి.
తాజాగా రిలీజ్ అయిన కిరణ్ అబ్బవరం ‘క’ తో పాటు తమిళ్ హీరో శివకార్తికేయన్ నటించిన అమరన్ సినిమాలకు తిరుపతిలోని ప్రతాప్ థియేటర్ లో ఈ రెండు సినిమాలకూ హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. ఈ బోర్డ్ చూసిన చాలామంది ఆశ్చర్యపోతున్నారు కూడా. ఆశ్చర్యంతో పాటు ఈ హీరోల సినిమాలకు ఆ బోర్డ్ పడింది అంటే ఖచ్చితంగా వారి కంటెంట్ లో దమ్ముంది అనుకుంటున్నారు.
ఇలాంటివి చూస్తే ఇండస్ట్రీకి కూడా కొత్త కళ వస్తుంది. కొంత ఉత్సాహం కలుగుతుంది. విషయం ఉన్న చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు అనే నమ్మకాన్ని పెంచుతుంది. కాకపోతే ‘క’ విషయంలో ముందు నుంచి గట్టి ప్రమోషన్ ఉంది. కానీ అమరన్ విషయంలో అదేం లేదు. అయినా హౌస్ ఫుల్ అంటే ఆశ్చర్యమేం కాదు. ఎందుకంటే తమిళనాడుకు దగ్గరగా ఉన్న తిరుపతిలో శివకార్తికేయన్ కు ఫ్యాన్స్ ఉండటంలో ఆశ్చర్యమేం లేదు కదా.
మొత్తంగా ఈ దీపావళికి విడుదలైన నాలుగు సినిమాలకూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com