Keerthi Suresh : కీర్తి సురేష్ లైనప్ చూస్తే అరాచకమే

పెళ్లి తర్వాత కాస్త స్లో అయింది కీర్తి సురేష్. సోషల్ మీడియాలో అంతకు ముందు కంటే కాస్త ఎక్కువ డోస్ తో గ్లామర్ కురిపించడం ప్రారంభించింది. దీంతో తను కొత్త ఆఫర్స్ కోసం ఇలా చేస్తుందేమో అనుకున్నారు చాలామంది. బట్ అమ్మడి లైనప్ ఆల్రెడీ ఓ రేంజ్ లో కనిపిస్తోంది. ఈ యేడాది నుంచి వచ్చే యేడాది వరకూ తన నుంచి వరుసగా సినిమాలు రాబోతున్నాయి. విశేషం ఏంటంటే.. వీటిలో ఎక్కువ భాగం తనే మెయిన్ లీడ్ లో ఉంది. తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా.
కీర్తి సురేష్ అమెజాన్ కోసం చేసిన సినిమా ‘ఉప్పు కప్పురంబు’ ఈ నెల 4న డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల కాబోతోంది. సుహాస్ మేల్ లీడ్ లో నటించిన ఈ సినిమా ట్రైలర్ చూస్తే సింపుల్ గా సాగిపోయే విలేజ్ డ్రామా అనిపించింది. రిజల్ట్ కంటే కూడా ఇదో ఎక్స్ పర్మెంట్ లా చేసిన సినిమా అనిపిస్తుంది.
ఇక ఆగస్ట్ 27న తన మోస్ట్ అవెయిటెడ్ మూవీగా చెబుతోన్న రివాల్వర్ రీటా విడుదల కాబోతోంది. జేకే చంద్రు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఓ దశలో అసలు ప్రాజెక్ట్ ఉందా లేదా అనిపించింది. బట్ ఫైనల్ గా ఆగస్ట్ 27న ఆడియన్స్ ముందుకు రాబోతోంది.
ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ కోసం చేసిన ఇంటెన్స్ డ్రామా ‘అక్కా’ రెడీ అవుతోంది. ఆ మధ్య విడుదలైన ఈ సిరీస్ టీజర్ చూసి స్పెల్ బౌండ్ అయ్యారు చాలామంది. ఎవరూ ఈ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేయలేదు. పైగా కాస్టింగ్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించుకుంది. రాధికా ఆప్టే, తన్వీ ఆజమ్, దీప్తి సాల్వి, అలేఖ్యా తోమర్ వంటి వారు నటించారు. అక్కా సిరీస్ కూడా ఈ యేడాదే విడుదల కాబోతోంది.
కొన్నాళ్లుగా హిందీ మార్కెట్ పై ఎక్కువగా కన్నేసిన కీర్తి సురేష్ ఆ మేరకు అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా అందాలారబోతకు కూడా వెనకాడటం లేదు. ఆ మధ్య వచ్చిన బేబీ చిత్రంలో తన గ్లామర్ చూసి సౌత్ మొత్తం నోరెళ్లబెట్టింది. త్వరలోనే మరో హిందీ మూవీతో రాబోతోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ రాజ్ కుమార్ రావు సరసన ఓ సినిమా చేస్తోందిప్పుడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయి. ఇవి కాక తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఓ సినిమా చేయబోతోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని రవి కిరణ్ కోలా డైరెక్ట్ చేయబోతున్నాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే యాక్షన్ మూవీ ఇది. సో.. మొత్తంగా ఉప్పు కప్పురంబుతో కలిపి మొత్తం ఐదు ప్రాజెక్ట్ తో ఓ రేంజ్ దూకుడు చూపిస్తోంది కీర్తి సురేష్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com