Gowtam Tinnanuri : రామ్ చరణ్ తర్వాత ఎన్టీఆర్ కథలో విజయ్ దేవరకొండ

ఎన్టీఆర్ కథలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడు. అయితే ఇది ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథ కావడం విశేషం. మరి ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథలు ఒకప్పుడు ఎంత పెద్ద విజయం సాధించాయో తెలుసు కదా. అందుకే విజయ్ కి ఇది గ్యారెంటీ బ్లాక్ బస్టర్ అనే టాక్ అప్పుడే మొదలైంది. ఇంతకీ విషయం ఏంటంటే.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో కింగ్ డమ్ అనే మూవీ చేస్తున్నాడు కదా. ఈ చిత్రాన్ని జూలై 4న విడుదల చేయబోతున్నారు. తర్వాత విజయ్ రౌడీ జనార్థన్ అనే మూవీ చేయబోతున్నాడు. రవి కిరణ్ కోలా డైరెక్ట్ చేయబోతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఫస్ట్ టైమ్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నాడీ రౌడీ స్టార్. ఆపై మైత్రీ బ్యానర్ లో రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో మరో సినిమా ఉండబోతోంది. ఇది పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోందనే టాక్ బలంగా ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత మళ్లీ కింగ్ డమ్ సినిమా ఉంటుంది.
కింగ్ డమ్ 2 తర్వాత మళ్లీ ఈ కాంబోలనే మరో సినిమా ఉండబోతోంది. అదే ఎన్టీఆర్ కు గౌతమ్ చెప్పిన కథ. ఎన్టీఆర్ నో చెప్పడంతో ఆ కథను విజయ్ తో చేయబోతున్నాడు గౌతమ్. విశేషం ఏంటంటే.. ఇప్పుడు చేస్తోన్న కింగ్ డమ్ కూడా ముందుగా రామ్ చరణ్ కోసం అనుకున్నదే. రామ్ చరణ్ నో చెప్పడంతో విజయ్ కి వచ్చిందా ప్రాజెక్ట్. నెక్ట్స్ ఎన్టీఆర్ కు చెప్పిన కథకు నో చెప్పడంతో అదీ విజయ్ తోనే చేయాలనుకుంటున్నాడు గౌతమ్. ఒకవేళ కింగ్ డమ్ పెద్ద విజయం సాధిస్తే ఈ కాంబినేషన్ కు మంచి క్రేజ్ వస్తుంది. ఆ క్రేజ్ ఈ మూవీకి బిగ్ ఎసెట్ అవుతుంది. అటు రౌడీ జనార్ధన్, రాహుల్ సాంకృత్యన్ మూవీస్ తో విజయ్ హిట్స్ కొడితే అతని రేంజూ మారుతుంది. ఏదేమైనా టైర్ 1 హీరోలు రిజెక్ట్ చేసిన రెండు కథల్లో విజయ్ దేవరకొండ నటించబోతుండటం అతని స్టార్డమ్ టైర్ 1లోకి రావడానికి ఎంతో దూరం లేదు అనేందుకు సంకేతం అనుకోవచ్చా..?
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com