Ajay Devgan : చాలా రోజుల తర్వాత అదరగొట్టిన బాలీవుడ్

ఈ సారి దీపావళి సౌత్ వారికే కాదు.. నార్త్ వారికి కూడా బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా సరైన విజయాలు లేక చాలాకాలంగా ఢీలా పడ్డ బాలీవుడ్ కు స్త్రీ 2 తర్వాత మరోసారి బాక్సాఫీస్ కు వద్ద కళ కనిపించింది. దీపావళి రోజు విడుదలైన సింగం అగెయిన్, భూల్ భులయ్యా 3 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా డిక్లేర్ అయ్యాయి. సింగం సిరీస్ లో అజయ్ దేవగన్ తో పాటు అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, కరీనాకపూర్, దీపికా పదుకోణ్ వంటి భారీ తారాగణంతో వచ్చిన సింగం అగెయిన్ నాలుగు రోజుల్లో దాదాపు 150 కోట్ల వరకూ వసూళ్లు సాధించింది.. ఈ భారీ తారాగణం అనే మాట నిలబెట్టింది. వీరి రేంజ్ కు తగ్గ కలెక్షన్స్ అయితే కాదు. కానీ కొన్నాళ్లుగా ఉన్న పరిస్థితితో పోలిస్తే చాలా చాలా బెటర్ గానే వసూళ్లు వచ్చాయి.. ఇంకా వస్తున్నాయి. టోటల్ రన్ లో సింగం అగెయిన్ 250 కోట్ల వరకూ వసూలు చేయొచ్చు అంటున్నారు.
ఇక చంద్రముఖిని సీక్వెల్ గా మార్చి భూల్ భులయ్యా అంటూ రూపొందించి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. అనీష్ బజ్మీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్, మాధురీ దీక్షిత్, తృప్తి దిమ్రి కీలక పాత్రల్లో నటించారు. సెకండ్ పార్ట్ లో టబు డ్యూయొల్ రోల్ చేసింది. ఆ రెండు పాత్రలను ఈ సారి విద్యా బాలన్, మాధురీ దీక్షిత్ తో ఫిల్ చేశారు. హారర్ కామెడీ మూవీస్ టెంప్లేట్ లోనే రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించడంలో మరోసారి సక్సెస్ అయింది. దీంతో కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ మూవీ కూడా 150 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఈ చిత్రం కూడా లాంగ్ రన్ లో 250 -300 కోట్లు వసూలు చేయొచ్చు అని అంచనా వేస్తున్నారు.
మొత్తంగా దీపావళి సందర్భంగా వచ్చిన ఈ రెండు సినిమాలూ విజయం సాధించడంతో బాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత ఓ జోష్ కనిపిస్తుంది. ఈ జోష్ ను కంటిన్యూ చేయడానికి మళ్లీ సౌత్ నుంచే కంగువా, పుష్ప 2 రాబోతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com