Dacoit collections : డెకాయిట్ కు పరాభవం..

అడివి శేష్ హీరోగా నటించిన మూవీ డెకాయిట్. ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. గ్రాండ్ గా చేసిన ప్రమోషన్స్ కారణంగానే ఈ రెవిన్యూ వచ్చిందని అంతా అనుకుంటున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ వీకెండ్ వరకు బాగానే వసూళ్లు సాధించింది. ఓరకంగా శేష్ మూవీస్ లో ఇప్పటి వరకు వచ్చిన హయ్యొస్ట్ కలెక్షన్స్ కూడా వస్తాయని చాలామంది భావించారు. ఆ మేరకు రిలీజ్ తర్వాత కూడా ప్రమోషన్స్ ను ఆపడం లేదు. నాని కూడా రంగంలోకి దిగాడు. తనకు మేజర్, గూఢచారి కంటే కూడా డెకాయిట్ బాగా నచ్చిందని చెప్పాడు. ఆ రేంజ్ లో ఈ మూవీకి ఇచ్చిన ఎలివేషన్స్ వల్ల భారీ వసూళ్లు వస్తాయని అనుకున్నారు. బట్ డెకాయిట్ సోమవారం పూర్తిగా తేలిపోయింది.
వీక్ డేస్ లో మామూలుగా మూవీస్ వీక్ అవుతున్నాయి. ఒకవేళ సూపర్ హిట్ టాక్ వచ్చిన మూవీస్ కి అయితే చాలా వరకూ మెప్పించే అవకాశం ఉంది. బట్ డెకాయిట్ కు సోమవారం కేవలం 2.5 కోట్లు వచ్చాయి. ఈ మొత్తం ఎంటైర్ టీమ్ ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఇంత దారుణమైన వసూళ్లు అస్సలు ఊహించలేదు. దీంతో వీకెండ్ వరకూ బాగానే రన్ చేసిన ఈ మూవీ వీక్ డేస్ లో మొదటి రోజే దారుణంగా పడిపోవడం బాక్సాఫీస్ కు కూడా షాక్ తగిలింది. అయితే మండే రోజు ఐపిఎల్ లో హైదరాబాద్ మ్యాచ్ ఉండటం మాత్రం బిగ్గెస్ట్ మైనస్ గా మారింది అనేది మాత్రం వాస్తవం. హైదరాబాద్ మ్యాచ్ కి శేష్ కూడా వచ్చాడు. అంటే ఆడియన్స్ తో పాటు ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు. బట్ థియేటర్ లోని ప్రేక్షకులంతా హైదరాబాద్ స్టేడియంలో ఆగిపోవడం మాత్రం దెబ్బకొట్టింది. మొత్తంగా ఈ మూవీ మంగళ వారం నుంచి అయినా మళ్లీ పికప్ అవుతుందా లేక పోతే అంతే సంగతులా అనేది మాత్రం చూడాల్సిందే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
