Niharika Konidela : దూసుకుపోతున్న కమిటీ కుర్రాళ్లు

Niharika Konidela : దూసుకుపోతున్న కమిటీ కుర్రాళ్లు
X

మెగా డాటర్ నిహారిక నిర్మించిన సినిమా కమిటీ కుర్రాళ్లు. ఈ నెల 9న విడదలవుతోంది. అంతా కొత్తవాళ్లే నటించిన ఈ మూవీ ఆడియన్స్ అటెన్షన్ ను బాగా గ్రాబ్ చేస్తోంది. స్ట్రాటజిక్ ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా పిఠాపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అలాగే సరికొత్త ఐడియాస్ తో ప్రమోషన్స్ లో దూసుకుపోతున్నారు. ఈ మూవీలో మెయిన్ లీగ్ గా 11 మంది నటించడం విశేషం. టైటిల్ ను బట్టి రెగ్యులర్ యూత్ ఫుల్ మూవీ అనుకున్నారు. బట్ ట్రైలర్స్ తర్వాత విషయం ఉన్న సినిమానే అనిపించుకుంటోంది. కాకపోతే ట్రైలర్ లో ఉన్న విషయం సినిమాలో కూడా బలంగా కనిపించాలి. అప్పుడే నిర్మాతగా నిహారిక ఫస్ట్ స్టెప్ సక్సెస్ అవుతుంది.

మెగా ఫ్యామిలీలో మినీ హీరోలను కూడా ప్రమోషన్ కు వాడుకున్న నిహారిక మెగాస్టార్ చిరంజీవితో కూడా ఓ వీడియో బైట్ చేయించకుంది. అదీ మూవీకి ప్లస్ అవుతుందనే చెప్పాలి. తను కూడా చాలా ఉత్సాహంగా ఇంటర్వ్యూస్ ఇస్తోంది. తనూ నటనపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్టు చెబుతూ ఆకర్షిస్తోంది. మెగా కాంపౌండ్ నుంచి వస్తోన్న మూవీ కాబట్టి ఇండస్ట్రీలోని ఇతరులు కూడా వీరికి ప్రమోషనల్ గా మాట సాయం చేసేందుకు ఇబ్బంది పడటం లేదు. మొత్తంగా చూసుకుంటే ఈ ఫ్రైడే పది సినిమాల వరకూ విడుదలవుతోంటే.. అందులో కమిటీ కుర్రాళ్లే కాస్త ఎక్కువ దూకుడుగా కనిపిస్తున్నారు.

Tags

Next Story