మదర్స్ డే స్పెషల్.. ఎయిర్ ఇండియా షాట్ ఫిల్మ్

మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లులకు కళాత్మకంగా నివాళి అర్పించేందుకు ఎయిర్ ఇండియా సిద్ధమైంది. ఓ షార్ట్ ఫిల్మ్‌ను విడుదల చేసింది. వీడియోలో గ్రామీ-నామినేట్ చేయబడిన ఆఫ్రోఫ్యూచరిస్ట్ సంగీతకారుడు పియర్స్ ఫ్రీలాన్‌తో సహా వివిధ దేశాలకు చెందిన నిపుణులు ఇందులో భాగమయ్యారు. పాకిస్తానీ-కొరియన్ సృష్టికర్త ఫాహిలా ముజాఫర్, టొరంటోకు చెందిన డిజిటల్ సృష్టికర్త విన్నీ లీ ఈ షార్ట్ ఫిల్మ్ కోసం పనిచేశారని ఎయిర్‌లైన్స్ పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లులకు నివాళి. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, ఎయిర్ ఇండియా మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్స్ హెడ్ సునీల్ సురేశ్.. “ప్రేమించే వారు ఏ ప్రయాణానికైనా అర్థం ఇస్తారని, ప్రతి ఒక్కరి జీవితంలో తల్లులు తిరుగులేని పాత్ర పోషిస్తారని తెలిపారు. మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంతమంది అద్భుతమైన వ్యక్తులను సంప్రదించాము. తల్లిగా వారి ప్రయాణంలో ఎదురైన గొప్ప సంఘటనలు వివరించమని కోరాము. వారి మాటల్లో భావోద్వేగం, ప్రేమ కనిపించింది. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లులకు ఎయిర్ ఇండియా ఇస్తున్న నివాళి అని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com