Sai Durga Tej : సాయి తేజ్ సంబరాల ఏటిగట్టులో ఐశ్వర్య
మెగా హీరో సాయిదుర్గా తేజ్ నెక్ట్స్ మూవీ ఏంటి అన్నది చాలామందికి తెలియడం లేదు. బట్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీతో రెడీ అవుతున్నాడు సాయితేజ్. హను మాన్ తో ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయం అందుకున్న నిరంజన్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. రోహిత్ కె.పి ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. సాయితేజ్ విరూపాక్ష చాలా పెద్ద హిట్ అయింది. ఆ హిట్ తో పాటు ఈ మూవీ రేంజ్ ను పరిగణలోకి తీసుకుని ఏకంగా 100కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారట. ఓ రకంగా ఇది హై రిస్క్ అనే చెప్పాలి. అత్యంత బలమైన కంటెంట్ అయితే తప్ప వర్కవుట్ కాదు. ఇక ఈ చిత్రానికి ‘సంబరాల ఏటి గట్టు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారనీ.. ఆల్మోస్ట్ ఆ టైటిలే ఫిక్స్ అని కూడా చెబుతున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందట. నటన విషయంలో బెస్ట్ ఇవ్వాలట. అందుకే ఐశ్వర్య లక్ష్మిని తీసుకున్నాం అని అనౌన్స్ చేశారు. తన బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. విశేషం ఏంటంటే.. ఈ మూవీ 1940స్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. అందుకే ఇంత బడ్జెట్ అని కూడా చెబుతున్నారు. విరూపాక్షలాగా ఇందులోనూ ఓ విలేజ్ సెట్ వేశారట. ఆ సెట్ లోనే మాగ్జిమం షూటింగ్ చేస్తారనీ.. అలాగే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం కూడా భారీగా ఖర్చు చేయబోతున్నట్టు కూడా సమాచారం. ఏదేమైనా ఇది సాయి దుర్గా తేజ్ కెరీర్లోనే హయ్యొస్ట్ బడ్జెట్ మూవీ కావడం విశేషం.
మరి తెరమీద సాయితేజ్, ఐశ్వర్య కాంబినేషన్ ఎలా ఉంటుందో కానీ.. విరూపాక్షలోనూ హీరోయిన్ పాత్రే బలమైనది, హైలెట్ అయింది. ఇందులోనూ అలాగే ఉంటుందేమో.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com