Aishwarya Rai : ఐశ్వర్యారాయ్ హైవే అలా మిస్సయింది!

హైవే సినిమా బాలీవుడ్లో ఎంత హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. వీరా త్రిపాఠి పాత్రలో అలియాభట్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నిజానికి ఆ పాత్ర అలియాది కాదట. ఆ ప్లేస్లో నటించాల్సింది ఐశ్వర్యారాయ్ అని రివీల్ చేశారు దర్శకుడు ఇంతియాజ్ అలీ. ఆ పాత్రకు తొలుత 30 ఏళ్లు పైబడిన నటి అయితే బాగుంటుంద నుకున్నారట. ఇందులో భాగంగా ఐశ్వర్యారాయ్ అయితే పక్కాగా యాప్ట్ అవుతుందని, ఆమెతో ఎలాంటి మేకప్ లేకుండా సినిమా పూర్తి చేయాలనుకున్నారుట. అనుకోకుండా అలియాభటిని కలిసిన తర్వాత తన ఆలోచన పూర్తిగా మారిపోయిందన్నారు ఇంతియాజ్. భావోద్వేగాల లోతు తెలిసిన నటి అలియాలో ఉందని గ్రహించినట్లు చెప్పారు. తనని కలిసి కథ ఇచ్చాను. కొన్ని రోజుల వరకూ ఎలాంటి పిలుపు రాలేదు. దీంతో ఆ కథ అలియాకి నచ్చలేదనుకున్నా. ఒకసారి అలియా దగ్గరకు వెళ్లి కథ నచ్చిందా? సినిమా చేద్దామా? అని అడిగాను. కథలో ఆమెలేని ఒక్క సన్నివేశం కూడా లేకపోవడంతో చేయగలనా? అని అలియాభట్ భయపడింది. ఆ తర్వాత ఒప్పుకుంది. అలా సినిమాలో ఐశ్వర్యారాయ్ స్థానంలోకి అలియాభట్ వచ్చింది' అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com