Aishwarya Rai : ఈడీ ఆఫీసుకు ఐశ్వర్యరాయ్.. పనామా పేపర్స్ లీకేజీపై ఎంక్వయిరీ

Aishwarya Rai : పనామా పేపర్స్ వ్యవహారంలో ఈడీ ముందు హాజరయ్యారు బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్. టాక్స్ ఎగవేసి విదేశాలకు నగదు తరలించారనే ఆరోపణలపై ఐశ్వర్యను ప్రశ్నించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇఛ్చింది. విదేశీ మారక ద్రవ్య నిబంధనల ఉల్లంఘన కింద అధికారులు ఐశ్వర్యను ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ ఐశ్వర్యకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఐతే అప్పుడు ఈడీ ముందు హాజరుకాలేనని ఐశ్వర్య చెప్పింది. ఐతే ఇవాళ ఆకస్మాత్తుగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు ఐశ్వర్య.
విదేశీ మారక ద్రవ్య నిబంధనల ఉల్లంఘన కేసులో 2017 నుంచి దర్యాప్తు చేస్తోంది ఈడీ. ఈ కేసులో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి నోటీసులు జారీ చేసింది.LRS కింద 2004 నుంచి వారి విదేశీ చెల్లింపులపై వివరణ ఇవ్వాలని కోరింది. ఇందుకు సంబంధించి తనకు విదేశాల నుంచి 15 ఏళ్లుగా వచ్చిన చెల్లింపుల రికార్డులను ఈడీకి సమర్పించింది ఐశ్వర్య.
ప్రపంచంలోని అత్యంత ధనికులు, శక్తివంతమైన వ్యక్తులు పన్నులు ఎగ్గొట్టడానికి తమ సంపదను షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారని 2016లో లీకైన పనామా పేపర్స్‌లో ఉంది. ఆ పేపర్స్‌లో ఐశ్వర్య రాయ్ సహా భారత్‌కు చెందిన ప్రముఖుల పేర్లు వచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com