Aishwarya Rai Bachchan: బాబోయ్.. కూతురిపై ప్రేమను ఇలా చూపించాలా: నెటిజన్స్ ట్రోల్స్

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ తన కుమార్తె ఆరాధ్యను ముద్దుపెట్టుకోవడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
ఆరాధ్యకు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మ ఐశ్వర్య వాళ్లిద్దరు దిగిన ఫోటోను పంచుకుంది. కూతురికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. అయితే ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు కూతురంటే ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఆ లిప్ కిస్ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
ఆమె విజయవంతమైన నటనా జీవితం ఉన్నప్పటికీ, తన కుమార్తె ఆరాధ్య కోసం పూర్తి కాలం అమ్మ పాత్ర నిర్వహిస్తోంది. ఆమె పుట్టినప్పటి నుండి, ఐశ్వర్య తన వృత్తిపరమైన షెడ్యూల్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తన కుమార్తెకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఉండేలా చూసుకుంది.
నవంబర్ 16, 2022 ఆరాధ్యకు 11 ఏళ్లు నిండినందున పుట్టినరోజును జరుపుకుంది. అర్ధరాత్రి వేడుకలో కూతురి పెదవులపై ముద్దు పెట్టింది. అలాంటి వ్యక్తీకరణ భారతీయ సంస్కృతికి సరిపోదని వ్యాఖ్యానించారు:
పిల్లల పెదవులపై ముద్దు పెట్టుకోవడం అనుచితమైన చర్యగా పేర్కొన్నారు. నుదుటి మీద ముద్దు పెట్టుకుంటే ఒక బాధ్యత, భద్రత, ప్రేమ కనిపించేది. లవర్స్ మాదిరిగా ఆ పెదవుల మీద ముద్దేంటి అని నెటిజన్లు ట్రోల్ చేస్తు్న్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com