అదేం డ్రెస్.. ఎవరు డిజైనర్: నెటిజన్స్ ట్రోల్స్

కేన్స్ ఫెస్టివల్.. రెడ్ కార్పెట్ మీద సినీ తారల వగలు.. ఒకరిని మించి మరొకరి డ్రెస్.. ఎప్పుడూ అట్రాక్ట్ అయ్యేది, కెమెరా ఫోకస్ అయ్యేది అందాల తార ఐశ్వర్యారాయ్ బచ్చన్ మీదే. ఈసారి ఆమె వేసుకున్న డ్రెస్ చూసి నెటిజన్స్ ఓ రేంజ్ లో కామెంట్ చేస్తున్నారు.ఐశ్వర్యరాయ్ బచ్చన్ పెద్ద వెండి హుడ్ గౌనులో కేన్స్ రెడ్ కార్పెట్ మీద నడిచింది.
మే 18న కేన్స్ 2023 రెడ్ కార్పెట్‌పై మెరిసే వెండి గౌనులో నడిచి హొయలు కురిపించింది. ఆ డ్రెస్ ఆమె తలను కప్పి ఉంచిన హుడీని చూసి నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కొందరైతే డిజైనర్ ను మార్చమని సలహా ఇచ్చారు. మరోపక్క ఆమె అభిమానులు ఆమె డ్రెస్ చూసి మురిసిపోయారు. సూపర్ ఐశ్ అంటూ ఆమెను అభినందించారు.
కేన్స్ 2023లో రెడ్ కార్పెట్ ప్రదర్శన కోసం, ఐశ్వర్య రాయ్ వెండి గౌనును ధరించింది. ఆమె ఫ్లోర్ స్వీపింగ్ గౌను వేలకొద్దీ అందమైన స్ఫటికాలతో అలంకరించబడింది.ఐశ్వర్య తొలిసారిగా 2002లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com