Aishwarya Rai: 'ఐష్' అందంలోనే కాదు.. సంస్కారంలోనూ.. : ఫ్యాన్స్ ఫిదా

Aishwarya Rai: అందాల నటి ఐశ్వర్యారాయ్ సినిమాల్లో కనిపించి చాలా కాలం అయింది. ఈ మధ్య మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వంలో నటిస్తోంది. ఈ చిత్రం ఈనెల 30న విడుదల కానున్న సందర్భంలో చిత్ర యూనిట్ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ఈవెంట్‌కు రజనీకాంత్, కమల్ హాసన్‌లు ముఖ్య అతిధులుగా విచ్చేశారు.
అలాగే సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఐశ్వర్యారాయ్ బచ్చన్, జయం రవి, త్రిష, కార్తీ, ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఈవెంట్‌కు వచ్చిన ఐశ్వర్య అప్పటికే వచ్చి ఉన్న రజనీకాంత్ కాళ్లకు దండం పెట్టి రెండు చేతులు జోడించి నమస్కరించిన తీరు ఆకట్టుకుంది. అనంతరం ఐశ్వర్యను రజనీ హగ్ చేసుకున్నారు.
ఐశ్వర్య సంస్కారానికి రజనీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. ఐశ్వర్య అందంలోనే కాదు సంస్కారంలోనూ ఆమెకు ఎవరూ సాటిరారు, మనిషే కాదు మనసు కూడా చాలా అందమైనది అని ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రోబో చిత్రంలో ఐశ్వర్య రజనీకి జోడీగా నటించిన విషయాన్ని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com