Aishwarya Rajinikanth : మళ్లీ డైరెక్షన్‌లోకి ఐశ్వర్య.. స్టార్ హీరోతో సినిమా..!

Aishwarya Rajinikanth : తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తన భర్త ధనుష్ నుండి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ధనుష్‌తో చాలా కాలంగా విభేదాలు రావడంతో ఐశ్వర్య విడాకులు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ధనుష్‌తో విడాకుల తర్వాత తన పనులో బిజీ అయిపొయింది ఐశ్వర్య.
ధనుష్ నటించిన 3 చిత్రానికి దర్శకత్వం వహించి దర్శకురాలిగా తనదైన ముద్రవేసిన ఐశ్వర్య.. ఆ తర్వాత సీనియర్ హీరో కార్తీక్ తనయుడు గౌతమ్‌తో ఓ సినిమా చేసి కమర్షియల్‌గా హిట్ కొట్టింది. ఇప్పుడు తమిళ స్టార్ హీరో శింబుతో ఓ భారీ బడ్జెట్ మూవీ చేసేందుకు అమె రెడీ అయిపోయిందట. శింబు, ఐశ్వర్యల మధ్య చాలా కాలంగా పరిచయం ఉంది.
వీరి కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా రానుందని గత కొన్నిరోజులుగా టాక్ నడుస్తోంది. మరి ఆ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా 2003లో విడుదలైన విజిల్ చిత్రంలో శింబు మరియు ఐశ్వర్య ఓ పాటని కలిసి పాడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com