Aishwaryaa Dhanush: విడాకుల తర్వాత వాలెంటైన్స్ డే కోసం ప్రేమపాట సిద్ధం చేస్తున్న ఐశ్వర్య ధనుష్..

Aishwaryaa Dhanush: ఈమధ్య కాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. ఏకంగా 18 సంవత్సరాలు కలిసుండి విడాకులు తీసుకున్న ధనుష్, ఐశ్వర్యల గురించి ప్రస్తుతం కోలీవుడ్‌లో పెద్ద చర్చే నడుస్తోంది. 18 ఏళ్లు సంతోషంగా గడిపేసిన వీరిద్దరు ఎందుకు విడిపోయారంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కానీ వీరు మాత్రం అవేవి పట్టించుకోకుండా ఎవరి పనిలో వారు బిజీ అయిపోయారు.
ధనుష్ కేవలం తెలుగు, తమిళంలోనే కాదు.. హిందీలో కూడా మోస్ట్ వాంటెడ్ స్టార్. కథ నచ్చితే భాషతో సంబంధం లేకుండా ఏ సినిమాకు అయినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు ధనుష్. అందుకే తన పాపులారిటీ హాలీవుడ్ వరకు కూడా వెళ్లిపోయింది. ప్రస్తుతం ధనుష్ చేతిలో తెలుగు, తమిళంతో పాటు ఇంగ్లీష్ సినిమాలు కూడా ఉన్నాయి. తాజాగా ధనుష్‌కు కరోనా రావడంతో కొన్నాళ్లు అన్ని షూటింగ్స్‌కు బ్రేక్ పడింది.
రజినీకాంత్ కూతురు ఐశ్వర్య మాత్రం విడాకులు అనౌన్స్ చేసి వారం రోజులే అయినా కూడా వెంటనే షూటింగ్స్‌లో అడుగుపెట్టేసింది. ప్రస్తుతం తాను ఓ మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేస్తోంది. ఈ ప్రేమపాట వాలెంటైన్స్ డే స్పెషల్‌గా విడుదల కానుంది. దీనికి సంబంధించిన షూటింగ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com