Aishwaryaa Rajinikanth: కొత్త ప్రయాణం మొదలుపెడుతున్న ఐశ్వర్య రజినీకాంత్.. సంతోషంగా ఉందంటూ పోస్ట్..

Aishwaryaa Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తెలు ఇద్దరూ ఎప్పటినుండో ఇండస్ట్రీలోనే ఉన్నా.. ఎప్పుడూ లైమ్ లైట్‌లోకి రావడానికి ఇష్టపడలేదు. సౌందర్య, ఐశ్వర్య ఇద్దరూ.. డైరెక్టర్స్‌గానే కోలీవుడ్‌లో సెటిల్ అవ్వడానికి కష్టపడుతున్నారు. అయితే తాజాగా ఐశ్వర్య రజినీకాంత్ ఓ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.
ఐశ్వర్య రజినీకాంత్ ఇప్పటికీ డైరెక్టర్‌గా మూడు సినిమాలను తెరకెక్కించింది. ఎప్పుడూ సినిమాల విషయంలో ఎక్కువగా తొందరపడకుండా ఆలోచించి అడుగులేస్తుంది ఐశ్వర్య. ఇక తాను చివరిగా డైరెక్ట్ చేసిన 'సినిమా వీరన్' ఒక డాక్యుమెంటరీ చిత్రంగా విడుదలయ్యి ఐదేళ్లుపైనే అయ్యింది. అయితే ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా తన డైరెక్షన్ ఎలా ఉంటుందో పరిచయం చేయనుంది ఐశ్వర్య.
'ఓ సాథి చల్' అనే ఓ ప్రేమకథతో హిందీలో డైరెక్టర్‌గా అడుగుపెట్టనుంది ఐశ్వర్య రజినీకాంత్. 'ఇంతకంటే బెటర్‌గా వారం స్టార్ట్ అయ్యిండదేమో. ఓ సాథి చల్ అనే అందమైన ప్రేమకథతో డైరెక్టర్‌గా హిందీలో డెబ్యూ ఇస్తున్నాను అని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా, అదృష్టంగా అనిపిస్తుంది' అంటూ ఐశ్వర్య తన ట్విటర్‌లో పోస్ట్ చేసి మూవీ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పింది.
My week couldn't have started better..Happy n feeling blessed to announce my directorial debut in Hindi "Oh Saathi Chal",an extraordinary true love story,produced by @MeenuAroraa @Cloud9Pictures1 @archsda #NeerajMaini need all your blessings n wishes pic.twitter.com/zqDH2BkQme
— Aishwarya Rajinikanth (@ash_rajinikanth) March 21, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com