Aishwaryaa Dhanush: ధనుష్ అన్నతో ఐశ్వర్య ఫోటో.. సోషల్ మీడియాలో షేర్..

Aishwaryaa Dhanush: ఇటీవల సినీ పరిశ్రమలో సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం ఎక్కువైపోయింది. అలాగే కోలీవుడ్‌లో రజినీకాంత్ కూతురు ఐశ్వర్య, ధనుష్‌ల విడాకులు కూడా పెద్ద సంచలనాన్నే సృష్టించాయి. ఏకంగా పెళ్లయి 18 ఏళ్లు కలిసున్న తర్వాత ధనుష్, ఐశ్వర్యలు విడాకులు తీసుకోవడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఐశ్వర్య మాత్రం ఇంకా ధనుష్ ఫ్యామిలీతో క్లోజ్‌గా ఉంటున్నట్టు తన సోషల్ మీడియా చూస్తే అర్థమవుతోంది.
ధనుష్ హీరోగా కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయితే.. తన అన్న సెల్వ రాఘవన్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచమంతా ఒకలాగా ఆలోచిస్తే.. తాను ఒకలాగా ఆలోచిస్తానంటూ సెల్వ రాఘవన్ ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటాడు. ఇటీవల సెల్వ రాఘవన్ తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఐశ్వర్య తన విషెస్‌ను సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
ధనుష్, ఐశ్వర్య విడాకుల తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. తాజాగా తన తెలుగు సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చాడు ధనుష్. ఐశ్వర్య కూడా తన మ్యూజిక్ ఆల్బమ్ కోసం హైదరాబాద్‌లో దిగింది. అయినా కూడా వీరిద్దరు ఒక్కసారి కూడా కలవలేదు. తమ కామన్ ఫ్రెండ్ పార్టీలో ఇద్దరు ఎదురుపడినా మాట్లాడుకోలేదు. అయితే ధనుష్ అన్నతో ఐశ్వర్య ఫోటో షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
సెల్వ రాఘవన్ పుట్టినరోజు సందర్భంగా ఐశ్వర్య తనతో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. 'హ్యాపీ బర్త్‌డే నా గురు, ఫ్రెండ్, ఫాదర్.. అలా చెప్పుకుంటూ వెళ్లొచ్చు' అంటూ సెల్వ రాఘవన్‌ను ట్యాగ్ చేసింది. అయితే ధనుష్ అన్నతో ఇంకా సన్నిహితంగా ఉంటుంది కాబట్టి ఐశ్వర్య.. త్వరలోనే ధనుష్‌తో కూడా మళ్లీ కలిసిపోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com