Dhanush Aishwaryaa Divorce: 'క్యాప్షన్ అవసరం లేదు'.. విడాకులపై ఐశ్వర్య స్పందన..

Dhanush Aishwaryaa Divorce: సినీ పరిశ్రమలో ఉన్నంత మాత్రాన వారి వారసులు కూడా హీరోలు, హీరోయిన్లు అవ్వాల్సిన అవసరం లేదు. వారికి నచ్చింది చేసే స్వేచ్ఛ వారికి ఇవ్వాలి అనుకునే వ్యక్తుల్లో రజినీకాంత్ కూడా ఒకరు. అందుకే తన కూతుళ్లు కోరుకున్నట్టుగా వారు డైరెక్టర్స్ అవ్వడానికి సపోర్ట్ చేశారు. ఇదివరకు రజినీ చిన్న కూతురు సౌందర్య విడాకులు తీసుకొని కొన్నాళ్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారితే.. ప్రస్తుతం పెద్ద కూతురు ఐశ్వర్య కూడా అలాగే చేయడంతో కోలీవుడ్ ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.
ఐశ్వర్య ధనుష్.. పెద్దగా లైమ్‌లైట్‌లోకి వచ్చే వ్యక్తి కాదు. ఇప్పటివరకు తాను మూడు సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో రెండు చిత్రాల్లో తన భర్త ధనుషే హీరో. ఒకపక్క భర్త ధనుష్ సక్సెస్‌ఫుల్ హీరో, మరోపక్క తండ్రి రజినీకాంత్ కోలీవుడ్‌కే సూపర్ స్టార్. సినీ పరిశ్రమను శాసిస్తున్న ఇలాంటి ఇద్దరు వ్యక్తులు తన ఇంట్లో ఉన్నా కూడా ఐశ్వర్య ఎప్పుడూ వారి పేరును ఉపయోగించి ఎదగడానికి ప్రయత్నించలేదు.
దర్శకురాలిగా ఐశ్వర్య తెరకెక్కించిన మూడు సినిమాలకు మంచి పేరు వచ్చినా.. అవి తనకు కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ తీసుకురాలేకపోయాయి. అయినా కూడా తాను ఎక్కడా కృంగిపోలేదు. అప్పుడప్పుడు ధనుష్‌తో పాటు అవార్డ్ ఫంక్షన్స్‌లో కనిపించేది ఐశ్వర్య. అలాంటి సందర్భాల్లో చాలామంది వీరిద్దరిని చూసి క్యూట్ కపుల్ అనుకునేవారు. కానీ ఈ బంధం నిన్నటితో ముగిసిపోయింది.
ధనుష్, ఐశ్వర్యలకు 2004లో వివాహం జరిగింది. అప్పటికీ ధనుష్ ఇంకా అప్‌కమింగ్ హీరోనే. ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ధనుష్‌కు అప్పుడే హీరోగా అవకాశాలు రావడం మొదలయ్యింది. అలాంటి ఓ అప్‌కమింగ్ హీరోకు రజినీ తన కూతురినిచ్చి వివాహం చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అదే అప్‌కమింగ్ హీరో కొన్నేళ్ల తర్వాత రజినీకాంత్‌తో పాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నాడు.
ఐశ్వర్య, ధనుష్ పెళ్లి జరిగి 18 ఏళ్లు అయ్యింది. వీరికి యాత్ర, లింగా అనే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత దారులు వేరంటూ ఐశ్వర్య, ధనుష్ విడిపోవడం చాలామందికి బాధ కలిగిస్తోంది. వీరి విడాకుల విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఐశ్వర్య.. 'క్యాప్షన్ అవసరం లేదు.. కేవలం మీరు అర్థం చేసుకొని ప్రేమను చూపించడమే అవసరం' అంటూ క్యాప్షన్ పెట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com