Aiswarya Rajesh : వెంకటేష్ ను మరిపించిన కొత్త ‘చంటి’..

చంటి అనగానే తెలుగు వారికి వెంటనే గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్. ఆ పాత్రలో ఆయన అంత బలమైన ముద్ర వేశాడు. వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇది. ఈ మూవీ తర్వాతే అతనికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయింది. వెంకీ తర్వాత అలాంటి ఇన్నోసెంటో హీరో క్యారెక్టర్ చేయాలని చాలామంది హీరోలు ప్రయత్నించారు కానీ అంతా ఫెయిల్ అయ్యారు. అయితే ఇన్నాళ్లకు వెంకీ ముందుకే మరో కొత్త చంటి రాబోతోంది. అదేంటీ చంటి అంటే రాబోతున్నాడు అనాలి కానీ .. రాబోతోంది అంటున్నారు అనుకుంటున్నారా.. యస్.. నిజమే.. చంటిలా వచ్చేది అబ్బాయ్ కాదు. అమ్మాయి.
వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ టాక్ ఆఫ్ ద టౌన్ లా ఉంటున్నాయి. ప్రతిసారీ ఓ ఇన్నోవేటివ్ ఐడియాతో అదరగొడుతున్నాడు అనిల్ రావిపూడి. పాటల విషయంలో అతను చేసిన హడావిడీకి ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా అతని ఐడియాస్ కు హ్యాట్సాఫ్ లు పడుతున్నాయి. అలాంటి ఐడియానే ఈ చంటి కూడా.
సంక్రాంతికి వస్తున్నాం టీమ్ నుంచి త్వరలో ఓ ఇంటర్వ్యూ రాబోతోంది. అయితే ఆ ఇంటర్వ్యూ రెగ్యులర్ యాంకర్స్ తో కాకుండా సినిమాలో ఓ హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేశ్ చేయబోతోంది. అయితే ఆమె వెంకీ ‘చంటి’ గెటప్ తో ఇంటర్వ్యూ చేయబోతోంది. ఆ గెటప్ తోనే ‘అన్నుల మిన్నుల అమ్మడి కన్నుల’ అనే చంటి మూవీ సాంగ్ కు డ్యాన్స్ లు వేస్తూ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ ఐడియా చూసిన వారంతా సింప్లీ సూపర్బ్ అంటున్నారు. అన్నట్టు ఐశ్వర్య కూడా మీసం పెడితే బలే ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com