MAA Elections 2021: మా ఎన్నికల్లో మద్దతుపై సినిమా అవకాశాలు..

MAA Elections 2021: మా ఎన్నికలు రోజురోజుకి అందరిలో ఆసక్తిని పెంచేస్తున్నాయి. మా ఎన్నికలు జనరల్ ఎన్నికలను తలపిస్తున్నాయన్న మాట ఎక్కడ చూసినా వినిపిస్తోంది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నవారు, వారికి మద్దతిస్తున్న సభ్యులు.. ఎవరికి వారు గెలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా చూస్తున్న సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో ఉన్నవారు కూడా దీనిపై కామెంట్ చేస్తున్నారు. ఇటీవల ఓ దర్శకుడు మా ఎన్నికలపై హాట్ కామెంట్ చేసాడు.
ఆర్‌ఎక్స్ 100 సినిమా ఏ అంచనాలు లేకుండా విడుదలయ్యి ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. అలాంటి ఒక గుర్తుండిపోయే సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన దర్శకుడు అజయ్ భూపతి. తొలి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్‌ను సాధించిన ఈ దర్శకుడికి ఉన్నది ఉన్నట్టుగా మోహం మీద చెప్పే అలవాటు కూడా ఉంది. అందుకే మా ఎన్నికలపై తన అభిప్రాయాన్ని తాజాగా బయటపెట్టాడు అజయ్.
మా ఎన్నికలు థ్రిల్లింగ్‌గా సాగుతున్నాయని, ఈ థ్రిల్లింగ్ ఎపిసోడ్లు చూస్తుంటే తనకు కూడా పోటీ చేయాలని ఉందన్నాడు అజయ్ భూపతి. పైగా ఒక దర్శకుడు తన దగ్గరకు వచ్చి 'నాకు నచ్చిన ప్యానెల్‌కు మద్దతునిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా' అన్నాడని వెల్లడించాడు. ఆ దర్శకుడు పేరు బయటపెట్టకపోయినా ఇండస్ట్రీలో ఇలాంటి వారు కూడా ఉంటారా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com