Karna : అజయ్ భూపతికీ కర్ణుడు కావాలట

Karna : అజయ్ భూపతికీ కర్ణుడు కావాలట
X
కర్ణుడి కథతో అజయ్ భూపతి కొత్త సినిమా..

ఆర్ఎక్స్ 100తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి ఓవర్ నైట్ టాలీవుడ్ లో ఫేమ్ అయిన దర్శకుడు అజయ్ భూపతి. బట్ ఆ తర్వాత చేసిన మహా సముద్ర డిజాస్టర్ అయింది. మళ్లీ పాయల్ రాజ్ పుత్ తోనే చేసిన మంగళవారం సినిమా కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది కానీ.. కొన్ని విమర్శలూ వచ్చాయి. నింఫోమానియాక్ అమ్మాయి కథ కొందరికి నచ్చింది. కొందరికి నచ్చలేదు. ఏదైతేనేం.. అతనికి డబ్బులు వచ్చాయి. ప్రాజెక్ట్ సేఫ్ అయింది. ఈ మంగళవారం సినిమాకే సీక్వెల్ తీయాలని స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు అజయ్ భూపతి. కానీ ఈ లోగా అతనికి మైత్రీ మూవీస్ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. దీంతో సీక్వెల్ ను హోల్డ్ లో పెట్టి మరో కొత్త కథతో రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కర్ణ అట.

కర్ణ అనగానే వెంటనే మహా భారతం గుర్తొస్తుంది. ఇప్పటి వరకూ అజయ్ తీసిన సినిమాలు చూస్తే అతను మైథాలజీ చేస్తాడు అంటే ఎవరూ నమ్మరు. ఆ విషయం అతనికీ తెలుసు. అందుకే అతను చేసే కర్ణ పౌరాణికం కాదు. రెగ్యులర్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ నే చేయబోతున్నాడు. ఈ మూవీకే కర్ణ అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడు. ప్రస్తుతం కర్ణ పాత్రలో నటించే హీరో కోసం వెదుకుతున్నాడట. టైటిల్ ను బట్టి చూస్తే హీరో చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అంటే ఆ పాత్ర చేయడానికి రెగ్యులర్ కమర్షియల్ హీరోలు ముందుకు వస్తారు అనుకోలేం. అయినా టైర్ టూ లోనే కాస్త బాగా తెలిసిన హీరోలనే ప్రయత్నిస్తున్నాడట. మరి అజయ్ కర్ణుడు ఎవరు అనేది త్వరలోనే తెలుస్తుంది. మరో విశేషం ఏంటంటే మంగళవారం సీక్వెల్ కోసం బాలీవుడ్ నిర్మాతలను సంప్రదిస్తున్నాడట అజయ్ భూపతి.

Tags

Next Story