Ajay Bhupathi : అజయ్ భూపతికి ఆ లక్ దక్కుతుందా..

Ajay Bhupathi :  అజయ్ భూపతికి ఆ లక్ దక్కుతుందా..
X

ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసిన దర్శకుడు అజయ్ భూపతి. ఆర్ఎక్స్ 100 టాలీవుడ్ హిస్టరీలో ఓ స్పెషల్ మూవీ అనే చెప్పాలి. హ్యూమన్ ఎమోషన్స్ తో ఆడుకునే విధానంలో కొత్త కోణాన్ని చూపించాడు అజయ్. ఇది ఆడియన్స్ కు బాగా నచ్చింది.. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. బట్ ఆ తర్వాత చేసిన మహా సముద్రం డిజాస్టర్ అనిపించుకుంది. దీంతో కొంత గ్యాప్ తీసుకుని మంగళవారం అనే కాన్సెప్ట్ మూవీతో వచ్చాడు. ఇది బావుందన్న టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గానూ ఓకే. ప్రస్తుతం మంగళవారం 2 తీయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే అంతకంటే ముందే అతనికో బంపర్ ఆఫర్ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

ఆర్ఎక్స్ 100 చూసిన తర్వాత తమిళ్ హీరో ధనుష్ అతన్ని చెన్నైకి పిలిపించి మరీ అభినందించాడు. మంచి కథ ఉంటే చెప్పమని కూడా అడిగాడు. అజయ్ అతన్ని మెప్పించలేకపోయాడు. బట్ ఎక్కడ కనెక్ట్ అయ్యాడో కానీ చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ తో సినిమా చేసే అవకాశం వచ్చిందంటున్నారు. ధృవ్ విక్రమ్ తండ్రికి తగ్గ తనయుడుగా దూసుకుపోయే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పటికే చేసిన సినిమాలో మంచి ఫ్యూచర్ ఉన్న వాడుగా పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా అతని బర్త్ డే స్పెషల్ గా మరి సెల్వరాజ్ డైరెక్షన్ ఓ సినిమా అనౌన్స్ అయింది. అంటే నటనకు హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉండే కథ అనుకోవచ్చు. మారి సెల్వరాజ్ అలాంటి కథలే ఎంచుకుంటాడు కాబట్టి ధృవ్ కి ఇది చాలెంజింగ్ రోల్ అవుతుంది. ఇక ఈ టైమ్ లో అజయ్ భూపతికీ ఓకే చెప్పాడనే న్యూస్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి. తెలుగు, తమిళ్ బై లింగ్వుల్ స్టోరీ ఒకటి అజయ్ వద్ద ఉందట. అది ధృవ్ కి నచ్చిందనీ.. త్వరలోనే ఈ కాంబోలో సినిమా అనౌన్స్ అవుతుందనే న్యూస్ వినిపిస్తున్నాయి. నిజం అయితే అజయ్ భూపతికి లక్ చిక్కినట్టే. మరి ఇది నిజమా కాదా అనేది చూడాలి.

Tags

Next Story