Ajay Devgn: 'వాటి వల్లే రెండుసార్లు జైలుకు వెళ్లాను': అజయ్ దేవగన్

Ajay Devgn (tv5news.in)

Ajay Devgn (tv5news.in)

Ajay Devgn: రన్ వే 34 ప్రమోషన్స్ సమయంలో అజయ్ దేవగన్ ఓ షాకింగ్ విషయం బయటపెట్టాడు.

Ajay Devgn: మామూలుగా సినీ సెలబ్రిటీలు వారి జీవితంలో చేసిన తప్పుల గురించి పెద్దగా బయటికి చెప్పుకోరు. ఒకవేళ చెప్తే.. అందరూ దానిని ఎలా అన్వయించుకుంటారో అని భయపడతారు. కానీ ఈ బాలీవుడ్ హీరో మాత్రం అలా కాదు.. తన అప్‌కమింగ్ సినిమా ప్రేమోషన్స్ సమయంలో అజయ్ దేవగన్ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

అమితాబ్‌ బచ్చన్, రకుల్ ప్రీత్‌ సింగ్, ఆకాంక్ష సింగ్‌, అజయ్ దేవగన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రమే 'రన్‌ వే 34'. బాలీవుడ్ సీనియర్ హీరో అయిన అజయ్ దేవగన్.. ఇప్పటికే రెండుసార్లు దర్శకుడిగా మైక్రోఫోన్ పట్టుకున్నాడు. చివరిగా తను 'శివాయ్‌' సినిమాకు దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ చిత్రం 2008లో విడుదలయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు రన్ వే 34 కోసం డైరెక్టర్‌గా మారాడు అజయ్.

రన్ వే 34 ప్రమోషన్స్ సమయంలో అజయ్ దేవగన్ ఓ షాకింగ్ విషయం బయటపెట్టాడు. ప్రతీ ఒకరు తమ చిన్నతనంలో తప్పులు చేస్తుంటారని, కానీ తాను మాత్రం అంతకంటే ఎక్కువే చేశానన్నాడు అజయ్. ఒకసారి తన తండ్రి గన్ దొంగిలించినందుకు, ఇంకోసారి మరో తప్పు చేసినందుకు.. ఇలా రెండుసార్లు జైలుకు వెళ్లానని అన్నాడు అజయ్ దేవగన్. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story