Aaman : అజయ్ దేవ్ గణ్ కొడుకు, రవీనా టాండన్ కూతురు జంటగా ఆజాద్

ఏ ఇండస్ట్రీలో చూసినా ఇప్పుడు వారస హీరోలతో హవా. బాలీవుడ్ లో అయితే హీరోయిన్లు కూడా వారసురాళ్లే ఉన్నారు. వారి తర్వాతే ఎవరైనా అనేది అక్కడ అనఫీషియల్ రూల్. దీనిపై కంగనా రనౌత్ లాంటి వారు పోరాటం చేసినా నో యూజ్. సరే.. దీన్ని ఎవరూ మార్చలేరు కాబట్టి.. లేటెస్ట్ గా మరో వారస జంట వెండితెరకు పరిచయం అవుతున్న వైనాన్ని తెలుసుకుందాం.
బాలీవుడ్ స్టార్ హీరోస్ లో అజయ్ దేవ్ గణ్ ఒకడు. తన తరం హీరోల్లో ఇంటెన్సిటీ ఉన్న ఏకైక హీరో అనిపించుకున్నాడు. అతనికంటే ఎక్కువ పాపులారిటీ ఉన్న బ్యూటీ కాజోల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి తనయుడు ‘ఆమన్ దేవ్ గణ్’హీరోగా పరిచయం అవుతున్నాడు. స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించిన రవీనాటాండన్ కూతురు ‘రషా టండానీ’హీరోయిన్ గా ఇంటర్డ్యూస్ అవుతోంది.
‘ఆజాద్’ అనే టైటిల్ తో స్వాతంత్ర్యానికి పూర్వం ఆ స్వేచ్ఛ కోసం సాగిన పోరాట నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అజయ్ దేవ్ గణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఆజాద్ టీజర్ విడుదలైంది. విశేషం ఏంటంటే.. ప్రతి సాహసవంతమైన సైనికుడి విజయంలో ఓ బలవంతమైన గుర్రం ఉంటుందనే పాయింట్ ను వీళ్లు హైలెట్ చేస్తున్నారు. ఆ కాలానికి తగ్గ కంటెంట్ కాబట్టి దేశభక్తితో కూడిన కథే అయినా.. ఇందులో యువ జంట ప్రేమకథ, గుర్రం స్టోరీ కూడా మిక్స్ అయి ఉన్నాయి.
కొత్తగా పరిచయం అవుతోన్న ఆమన్, రషా ఇద్దరూ చూడ్డానికి బావున్నాయి. టీజరే కాబట్టి పెద్దగా క్లోజప్ షాట్స్ లేవు. అంచేత అప్పుడే వీరి ఎక్స్ ప్రెషన్స ను కామెంట్ చేయలేం. రషా తల్లిలాగానే క్యూట్ గా ఉంది. ఆమన్ కు తల్లి పోలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ కొత్త బాలీవుడ్ లో తమదైన ముద్ర వేస్తుందా లేదా అనేది చూడాలి. అన్నట్టు ఈ చిత్రాన్ని 2025 జనవరిలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ డేట్ చెప్పలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com