Ajay Ghosh: ఇంట్లో నుండి బయటికి రావాలంటే వణికిపోయాను: 'పుష్ప' యాక్టర్ అజయ్ ఘోష్

Ajay Ghosh (tv5news.in)
Ajay Ghosh: డిసెంబర్ 17న విడుదలయిన పుష్ప సినిమా కలెక్షన్ల విషయంలో జోరును కొనసాగిస్తోంది. మొదటి వీకెండ్ కూడా ఇంకా హౌస్‌ఫుల్‌తో దూసుకుపోతోంది పుష్ప. అయితే ఈ సినిమాలో ప్రతీ పాత్రను గుర్తుండిపోయేలా డిజైన్ చేసిన సుకుమార్‌కు ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ రెస్పెన్సే అందుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన నటుడు.. పుష్ప సమయంలో తాను ఎదుర్కున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు.
పలు సినిమాల్లో విలన్‌గా, విలన్ దగ్గర పనిచేసే వ్యక్తిగా నటించిన ఆర్టిస్ట్ అజయ్ ఘోష్. పుష్పలో ముఠా నాయకుడు కొండారెడ్డి పాత్రలో అందరినీ ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగానే ఈ సినిమాలో తన విలనిజంకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం'లో కూడా విలన్‌గా నటించిన జగపతిబాబుతో ఉండే ఓ కీలక పాత్రలో అజయ్ కనిపించారు.
రంగస్థలంలో అజయ్ ఘోష్ నటనకు ఇంప్రెస్ అయిన సుకుమార్.. మరోసారి తనకు పుష్పలో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో తన జీవితంలో జరిగిన కొన్ని కఠిన విషయాల గురించి అజయ్ బయటపెట్టారు. పుష్ప సినిమా ఆఫర్ వచ్చే సమయానికి అజయ్ కరోనా నుండి కోలుకుంటున్నారట. అందుకే ముందు ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారట.
కరోనా నుండి బయటపడుతున్న సమయంలో మనుషులను చూడాలన్నా, వారితో మాట్లాడాలన్నా చాలా భయపడేవారట. అంతే కాక ఇంట్లో నుండి బయటికి వెళ్లాలన్నా భయంతో వణికిపోయారట. ఒంటరిగా ఒక గదిలోనే చాలారోజులు గడిపేసారట అజయ్. పుష్ప సినిమా ఆఫర్‌ను ముందుగా రిజెక్ట్ చేసిన తర్వాత అజయ్ ఘోష్‌కు నేరుగా దర్శకుడు సుకుమారే ఫోన్ చేశారట.
సుకుమార్ ఫోన్ చేసి ధైర్యం చెప్పడంతోనే ఇంట్లో నుండి బయటికి వచ్చారట అజయ్ ఘోష్. సెట్స్‌లో అడుగుపెట్టిన తర్వాత కూడా సుకుమార్ తనను ఎంతో గౌరవంగా చూసుకున్నారని అజయ్ అన్నారు. తాను మళ్లీ మామూలు మనిషిని కావడానికి సుకుమార్ ఎంతో సపోర్ట్ చేశారని తెలిపారు. అందుకే సుకుమార్ తన దృష్టిలో డైరెక్టర్ కాదని దేవదూత అని ప్రశంసించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com