Ajith Kumar : అజిత్ కు దుబాయ్ లో కార్ ప్రమాదం

తమిళ్ స్టార్ హీరో అజిత్ కు కార్, బైక్ రేస్ లంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ఒక్కడే బైక్ రైడింగ్ చేసుకుంటూ దేశమంతా తిరిగిన సందర్భాలున్నాయి. ఈ వయసులో కూడా ప్రొఫెషనల్ రేస్ లలో పార్టిసిపేట్ చేస్తుంటాడు. దుబాయ్ లో ఈ నెల 11, 12 తేదీల్లో జరుగనున్న 24H దుబాయ్ 2025 రేసు కోసం ప్రాక్టీస్ చేస్తుండగా అతని స్పోర్ట్స్ కార్ అదుపు తప్పి గోడను ఢీ కొట్టింది. ట్రాక్ పైనే గోడనే ఢీ కొట్టడంతో కార్ గిర్రున తిరుగుతూ ఫల్టీలు కొట్టిందా అన్నంత పని చేసింది. కానీ పల్టీ కొట్టకుండానే కార్ ఆగిపోయింది. వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది స్పందించారు. ప్రమాదం జరిగిన స్పోర్ట్ కారులో నుంచి వేరే కారులోకి అజిత్ అక్కడి నుంచి తీసుకువెళ్లారు. ఈ ప్రమాదంలో అజిత్ కు ఎలాంటి గాయాలూ కాలేదు.
మామూలుగా రేస్ లలో పాల్గొనే వారు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. కానీ ప్రమాద తీవ్రతను బట్టి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు దుర్ఘటనలు జరుగుతుంటాయి. అజిత్ విషయంలో అలాంటిదేం జరగకపోవడంతో అభిమానులతో పాటు శ్రేయోభిలాషులు ఊపిరి పీల్చుకున్నారు. మరి ఈ రేస్ లో ఆయన కంటిన్యూ అవుతాడా లేక వైదొలుగుతాడా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com