అజిత్ కొత్త బిజినెస్ స్లోగన్: 'లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ రైడ్'

అజిత్ కొత్త బిజినెస్ స్లోగన్: లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ రైడ్
సినిమాల్లో నటించడం ఎంత ప్యాషనో అంతకంటే ఎక్కువగా బైక్ రైడింగ్ ను ఇష్టపడుతుంటాడు తమిళ్ స్టార్ అజిత్.

సినిమాల్లో నటించడం ఎంత ప్యాషనో అంతకంటే ఎక్కువగా బైక్ రైడింగ్ ను ఇష్టపడుతుంటాడు తమిళ్ స్టార్ అజిత్. పవర్ ఫుల్ యాక్షన్ మూవీస్ తో ఆకట్టుకుంటున్న అజయ్ బైక్ మీద ప్రపంచం చుట్టేయాలన్న కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. సినిమాలకు కాస్త గ్యాప్ వచ్చినా ఆ సమయంలో మోటార్ సైకిల్ పై రోడ్ ట్రిప్ కి వెళుతుంటారు.

ప్రస్తుతం విడా ముయార్చి షూటింగ్‌లో ఉన్న అజిత్ కుమార్, మోటార్‌సైకిళ్లపై తనకున్న మక్కువతో మోటార్‌సైకిల్ టూరింగ్ కంపెనీని ప్రారంభించాడు.తాను ఎకె మోటో రైడ్ అనే టూరింగ్ కంపెనీని ప్రారంభిస్తున్నానని, ఇది భారతదేశం అంతటా ఔత్సాహవంతులైన బైక్ రైడర్‌లను అందిస్తుందని తెలిపాడు. విదేశాలను చుట్టి వచ్చేందుకు ఈ కంపెనీ నుంచి బైక్ లను రైడ్ కోసం అద్దెకు తీసుకోవచ్చు. దీనిని అజిత్ లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ రైడ్ గా అభివర్ణించారు.

అజిత్ తన రాబోయే ప్రాజెక్ట్ విదా ముయార్చిలో నటించేందుకుగాను తన ప్రపంచ బైకింగ్ టూర్, రైడ్ ఫర్ మ్యూచువల్ రెస్పెక్ట్ నుండి విరామం తీసుకున్నాడు. అతను ఇప్పటికే భారతదేశం అంతటా పర్యటించాడు. ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత అతను సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాలో రెండవ షెడ్యూల్‌ను తిరిగి ప్రారంభించనున్నాడు. ప్రపంచ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో రైడ్ చేయనున్నాడు.

ఇక అతని ఫ్యాన్స్ విడా ముయార్చి అతడు నటించిన తునివు కంటే మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నారు. తునివు అజిత్ అభిమానులను నిరాశపరిచింది. మఘిజ్ తిర్ముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించనున్నారు. 2024లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story