Ajith's Pattudala OTT : ఓటిటిలోకి అజిత్ డిజాస్టర్ మూవీ.. ఎప్పుడంటే

Ajiths Pattudala OTT :  ఓటిటిలోకి అజిత్ డిజాస్టర్ మూవీ.. ఎప్పుడంటే
X

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, త్రిష జంటగా నటించిన సినిమా 'విడాముయర్చి'. ఈ చిత్రాన్ని తెలుగులో పట్టుదల పేరుతో డబ్ చేశారు. మగిల్ తిరుమేని డైరెక్ట్ చేసిన ఈ మూవీకి థియేటర్స్ నుంచి డిజాస్టరస్ రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్ లో 90స్ లో వచ్చిన బ్రేక్ డౌన్ అనే మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని ఎక్కడా ఆడియన్స్ ను ఎంగేజ్ చేసేలా రూపొందించలేకపోయాడు దర్శకుడు. పైగా సినిమాలో ఒకటీ అరా సీన్స్ తప్ప మక్కీకి మక్కీ దించేశాడు. దీంతో సినిమా ఆసాంతం బోరింగ్ గా ఉండటంతో అజిత్ కు వీరాభిమానులు కూడా భరించలేకపోయారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ సగం వరకూ హీరోను చేతగాని వాడిగా చూపించాడు. ఈ ఏజ్ లో అజిత్, త్రిషల మధ్య లవ్ ట్రాక్ పేలవంగా ఉండటంతో పాటు.. అజిత్ లాంటి హీరో భార్య మరొకడితో ఎఫైర్ పెట్టుకోవడానికి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇవన్నీ కలిపి సినిమాకు డిజాస్టర్ టాక్ తెచ్చాయి. కమర్షియల్ గా కూడా మూవీ లాస్ అయింది. కేవలం 180 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.

అయితే థియేటర్స్ లో ఎంతో డిజాస్టర్ అయిన సినిమాలు కూడా ఓటిటిలో కొన్నిసార్లు ఆకట్టుకుంటాయి. అందుకే ఓటిటిలో ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారు కూడా ఉన్నారు. పట్టుదల చిత్రన్ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మార్చి 3 నుంచి ఆ ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ స్ట్రీమ్ కాబోతోంది. మరి ఓటిటిలో పట్టుదలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Tags

Next Story