Ajith's Puttudala : అజిత్ పట్టుదల మూవీ రివ్యూ

రివ్యూ : పట్టుదల
తారాగణం : అజిత్, అర్జున్, త్రిష, రెజీనా కసాండ్రా, ఆరవ్ తదితరులు
ఎడిటర్ : ఎన్.బి శ్రీకాంత్
సంగీతం : అనిరుధ్
సినిమాటోగ్రఫీ : ఓమ్ ప్రకాష్
నిర్మాత : సుభాస్కరన్ అల్లీరాజ్
మూలకథ : బ్రేక్ డౌన్ (హాలీవుడ్ మూవీ)
దర్శకత్వం : మగిళ్ తిరుమేని
తమిళ్ లో అజిత్ మూవీ అంటే ఎంతో క్రేజ్ ఉంటుంది. అక్కడ టాప్ 5 స్టార్స్ లో ఒకడుగా ఉన్నాడు. ఈ విడాముయర్చి(తెలుగులో పట్టుదల) చిత్రం సంక్రాంతికే రావాలి. ఆలస్యం అయింది. ఈ గురువారం విడుదలైంది. పారామౌంట్ వాళ్లు నిర్మించిన హాలీవుడ్ మూవీ బ్రేక్ డౌన్ కు రీమేక్ గా రూపొందిన ఈచిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ :
అర్జున్(అజిత్) కయాల్(త్రిష) దంపతులు. అజర్ బైజాన్ లో కాపురం ఉంటారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. 12యేళ్ల కాపురం తర్వాత కయాల్ తనకు విడాకులు కావాలంటుంది. అంతేకాక తను మరెవరినో ఇష్టపడుతున్నా అని చెబుతుంది. ఈ క్రమంలో తన పేరెంట్స్ వద్దకు వెళ్లాలనుకున్న కయాల్ ను తను దింపుతా అని ఆన్ రోడ్ లో ప్రయాణం మొదలుపెడతారు. ఈ రూట్ లో ఫోన్ సిగ్నల్స్ ఉండవు. మధ్యలో వీరికి ట్రక్ డ్రైవర్ అయినరక్షిత్(యాక్షన్ కింగ్ అర్జున్) అతని భార్య దీపిక(రెజీనా) పరిచయం అవుతారు. కొంత దూరం వెళ్లాక వీరు ప్రయాణిస్తున్న కార్ ఆగిపోతుంది. అదే రూట్ లో ట్రక్ తో వస్తున్న రక్షిత్ తో కయాల్ ను పంపించి మెకానిక్ కు ఫోన్ చేయమని చెబుతాడు. అలాగే అక్కడ గబ్బర్ అనే హోటెల్ లో ఉండమని సలహా ఇస్తాడు రక్షిత్. కొంత సేపటికి అతని కార్ స్టార్ట్ అవుతుంది. అతను గబ్బర్ హోటెల్ కు వెళితే అక్కడికి ఎవరూ రాలేదని చెబుతారు. కంగారుగా వెళుతున్న అతనికి రక్షిత్ ట్రక్ కనిపిస్తుంది. వెళ్లి అడిగితే తన పేరు ధీరజ్ అని చెబుతాడు. పోలీస్ లు వస్తే తన ఐడెంటిటీ కార్డ్స్ కూడా చూపిస్తాడు. అర్జున్ కు ఏం చేయాలో పాలుపోదు. దీనికి తోడు వీరిని మొదటి నుంచి ఒక గ్యాంగ్ వెంటాడుతుంటుంది. మరి వాళ్లెవరు.. ? కయాల్ కు ఏమైంది..? రక్షిత్ పరిచయమైన వ్యక్తి అబద్ధం ఎందుకు చెప్పాడు..? అర్జున్ తన భార్య కయాలను కనుగొన్నాడా లేదా అనేది మిగతా కథ.
ఎలా ఉంది..?
రీమేక్ లలో రిస్క్ ఎంత ఉంటుందో సౌలభ్యం కూడా అంతే ఉంటుంది. రోడ్ ట్రావెల్ థ్రిల్లర్ అనగానే స్వతహాగా మంచి డ్రైవర్ అయిన అజిత్ ఎగ్జైట్ అయ్యి ఉంటాడు. కానీ హాలీవుడ్ లో ఎప్పుడో వచ్చిన ఈ కథ ఇప్పటి ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది ఆలోచించలేదు అనిపిస్తుంది. నిజానికి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ ఆ ఎలిమెంట్స్ వచ్చే టైమ్ కే ప్రేక్షకుల సహనం తగ్గిపోతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో అచేతనంగా ఉంటాడు. అదే పనిగా తన్నులు తింటూ.. ఓ చేతగాని వాడిగా కనిపిస్తాడు. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ బావుంటుంది. భార్య మిస్ కావడం.. అనే ఆందోళనలో ఉన్న భర్తను బ్లాక్ మెయిల్ చేసే గ్యాంగ్ అతనికి పెద్ద ట్విస్ట్ ఇస్తారు. ఆ తర్వాత కథనం వేగం అందుకుంటుందా అంటే అదీ లేదు. చాలా సేపటికి హీరోలో హీరోయిజం బయటకు రాదు. దీని వల్ల ఈ రోడ్ థ్రిల్లర్ క్రాస్ రోడ్స్ లో ఆగినట్టు అనిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ మరీ సాగదీసినట్టుగా కనిపిస్తుంది. అజిత్, త్రిషల మధ్య లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటి లవ్ ట్రాక్ అస్సలు సూట్ కాలేదు. వీరు ప్రేమించుకుంటున్నారు అంటే నవ్వొస్తుంది తప్ప.. ఎమోషన్ కనెక్ట్ కాదు. పన్నెండేళ్ల కాపురం తర్వాత భర్త బర్త్ డే విషెస్(ఇంకొన్ని చిన్న కారణాలున్నా) చెప్పలేదని విడిపోదాం అనుకోవడం అతకలేదు. స్క్రీన్ ప్లే రోడ్ పైకి ఎక్కిన తర్వాత చాలా మూమెంట్స్ బావున్నాయి. తర్వాత ఏం జరుగుతుందా అనే కుతూహలం కలుగుతుంది. కానీ హీరోను పూర్తిగా డంబ్ గా చేయడం ఫస్ట్ హాఫ్ లో లోపంగా కనిపిస్తుంది.
ఇక సెకండ్ హాఫ్ లో చాలా సేపు సాగదీతే కనిపిసతుంది. కిడ్నాపర్ గ్యాంగ్ అడిగింది హీరో ఇచ్చేందుకు సిద్ధమవుతాడు. తనను బంధించి కార్లో తీసుకువెళుతున్నప్పుడు తిరగబడటం నుంచి మళ్లీ కథనం ట్రాక్ ఎక్కుతుంది. అప్పటి నుంచి నాన్ స్టాప్ యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండి ఉంటుంది. కానీ ఈ యాక్షన్ సీక్వెన్స్ లలో అజిత్ అంత స్పార్క్ గా కనిపించడు. వయసు ప్రభావం అనుకోవడానికి లేదు. టెక్నాలజీ ఉంది కాబట్టి. తక్కువ మంది విలన్స్ తో మొదలై.. పెరుగుతూ పోవడం.. వాళ్లంతా తనకు ముందే పరిచయమైన వాళ్లు కావడం చాలా ఊహించిందే అయినా.. ఆకట్టుకుంటుంది. ఇక అర్జున్, రెజీనా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సిల్లీగా ఉంటుంది.
మొత్తంగా యాక్షన్ మూవీస్ ను ఇష్టపడేవారికి సెకండ్ హాఫ్ సగం నుంచి నచ్చే అవకాశం ఉంది. డ్రా బ్యాక్స్ ఉన్నా ఫర్వాలేదు కాస్త కొత్తదనం ఉన్నా ఓకే అనుకుంటే పట్టుదలకు వెళ్లొచ్చు.
నటన పరంగా అజిత్ ఓకే అనిపించుకున్నాడు. త్రిష బావుంది. సెకండ్ హాఫ్ లో ఈ పాత్ర ఒకటీ రెండు సీన్స్ కే పరిమితం అవుతుంది. అర్జున్, రెజీనా అదరగొట్టారు. ఆరవ్ అనే కుర్రాడు విలన్ గా బాగా చేశారు. మిగతా పాత్రలేవీ పెద్దగా మనకు తెలిసినవి కాదు. అంతా ఓకే అనిపించుకునే ఆర్టిస్టులే.
టెక్నికల్ గా అనిరుధ్ ఎప్పట్లానే బ్రిలియంట్ అనిపించుకున్నాడు. ఈ కథను, థీమ్ ను అర్థం చేసుకుని నేపథ్య సంగీతం అందించాడు. రెగ్యులర్ మాస్ మూవీస్ లా కాకుండా ఓ కొత్త స్టైల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు బ్యాక్ బోన్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ చాలా చాలా బావుంది. యాక్షన్ కొరియోగ్రఫీ ఆకట్టుకుంటుంది. తెలుగులో అజిత్ డబ్బింగ్ అంతగా బాలేదు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. దర్శకుడుగా మగిళ్ తిరుమేని ఇప్పటి వరకూ చిన్న హీరోలతోనే చేశాడు. ఫస్ట్ టైమ్ వచ్చిన ఈ టాప్ హీరో అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు అనే చెప్పాలి. చాలా వరకూ హాలీవుడ్ బ్రేక్ డౌన్ మూవీనే దింపేశాడు. తనదైన ఆలోచనలు చాలా తక్కువగా కనిపిస్తాయీ చిత్రంలో. అది కొంత డ్రా బ్యాక్. తీసి పారేసే సినిమా కాదు. కానీ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ ను ఇష్టపడేవారికి మాత్రం నచ్చే అవకాశాలు తక్కువ.
ఫైనల్ గా : ‘పట్టు’ తగ్గింది
రేటింగ్ : 2.25/5
- బాబురావు. కామళ్ల
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com