Ajith Kumar : అజిత్ పట్టుదలను ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్న ఫ్యాన్స్

కోలీవుడ్ లో అజిత్ కుమార్ కు ఎంత ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలుసు. అతని సినిమా వస్తోందంటే ఫ్యాన్ వార్స్ కూడా జరుగుతుంటాయి. అయితే రీసెంట్ గా వచ్చిన అతని విడాముయర్చి (తెలుగులో పట్టుదల) మాత్రం బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. కనీసం వంద కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. హాలీవుడ్ లో 90స్ లో వచ్చిన 'బ్రేక్ డౌన్' అనే చిత్రానికి ఇది రీమేక్. ఆ కాలానికి ఆ కథ సరిపోయింది. కానీ అదే కథను ఈ కాలంలో కూడా అదే తరహాలో చెప్పాడు దర్శకుడు. దీంతో తేలిపోయింది. దీనికి తోడు అజిత్ తో పెళ్లి తర్వాత త్రిషాకు మరో వ్యక్తితో ఎఫైర్ ఉందని చెప్పడం.. ఈ వయసులో వీరి లవ్ స్టోరీ చూపించడం.. ఇవన్నీ సినిమాకు పెద్ద మైనస్ అయ్యాయి. అన్నిటికంటే దారుణంగా ఇంటర్వెల్ సగం వరకూ హీరో డమ్మీగానే కనిపిస్తాడు. అది వీరాభిమానులకు కూడా చిరాకు తెప్పించింది. మొత్తంగా ఇదో డిజాస్టర్ మూవీ. తెలుగులోనూ అంతే రిజల్ట్ అందుకుని ఇక్కడి అభిమానులను కూడా నిరాశపరిచింది.
అయితే ఈ చిత్రాన్ని మరో రకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. కోలీవుడ్ లో ఇలాంటివి చాలా కామన్ కూడా. నిజానికి రిలీజ్ తర్వాత నెల కూడా తిరక్కుండానే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమ్ అవుతోంది. అప్పటి నుంచి మా హీరో మూవీ నెట్ ఫ్లిక్స్ లో టాప్ లేపుతోందని ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం కొన్ని లెక్కలు కూడా చెబుతున్నారు.
నెట్ ఫ్లిక్స్ లో ఫస్ట్ వీక్ 3 మిలియన్ వ్యూస్ దక్కించుకుందట. నాన్ ఇంగ్లీష్ మూవీ కేటగిరీస్ లో 7వ స్థానంలో నిలిచిందంటున్నారు. 5 దేశాల్లో నెంబర్ 1 ప్లేస్ లో, 14 దేశాల్లో టాప్ 10లో ఉందంటున్నారు. అంటే ఓ రకంగా ఈ మూవీ ఓటిటిలో హిట్ అని చెబుతున్నాయి ఈ లెక్కలు. మరి థియేటర్స్ లో అంత దారుణంగా ఎలా పోయిందో మాత్రం చెప్పలేకపోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com