Ajith Kumar : సంక్రాంతి రేస్ నుంచి అజిత్ సినిమా అవుట్

Ajith Kumar :  సంక్రాంతి రేస్ నుంచి అజిత్ సినిమా అవుట్
X

తమిళ్ టాప్ స్టార్ తలా అజిత్ కుమార్ సినిమా వస్తోందంటే మీడియం రేంజ్ మూవీస్ అన్నీ ఆ డేట్ నుంచి పోస్ట్ పోన్ అవుతాయి. ఈ సంక్రాంతికి అతను నటించిన 'విడాముయర్చి' సంక్రాంతికి విడుదల కాబోతోంది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మగిళ్ తిరుమేని డైరెక్ట్ చేశాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ సంక్రాంతికి వస్తోందని.. విక్రమ్ నటించిన వీరధీర శూరన్ ను పోస్ట్ పోన్ చేశారు. ఈ మూవీ రేస్ లో ఉంటే కోలీవుడ్ లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ పై గట్టి ప్రభావం పడుతుందనే కామెంట్స్ కూడా వచ్చాయి. బట్ ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది నిర్మాణ సంస్థ.

అనుకోని అవాంతరాల వల్ల విడాముయర్చిని సంక్రాంతికి విడుదల చేయలేకపోతున్నాం అని చెబుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిందీ సంస్థ.దీంతో గేమ్ ఛేంజర్ కు కోలీవుడ్ లో అసలైన పండగ వస్తుందని సంబర పడుతున్నారు చాలమంది. అలాగే అజిత్ వస్తున్నాడని వాయిదా వేసుకున్న సినిమాలు కూడా మళ్లీ పొంగల్ రేస్ లోకి వచ్చే అవకాశం ఉంది.

విడాముయర్చి ఎందుకు వాయిదా పడింది.. అనేందుకు సరై కారణాలేం చెప్పలేదు నిర్మాణ సంస్థ. తర్వాతి అప్డేట్స్ కోసం ఎదురు చూడాలి.. మీ ఎదురు చూపులకు తగ్గ ఫలితం ఉంటుందని అభిమానులకు చెప్పింది. ఓ పెద్ద స్టార్ సినిమా.. అదీ పొంగల్ లాంటి పెద్ద సీజన్ నుంచి తప్పుకుందీ అంటే ఖచ్చితంగా బలమైన కారణాలే ఉంటాయి అని వేరే చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇప్పటికే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తయింది. ఫస్ట్ కాపీ కూడా రెడీగా ఉందనే న్యూస్ వినిపించిన తరుణంలో వాయిదా పడటం అభిమానులకు నిరాశనే మిగిల్చింది అని చెప్పాలి.

Tags

Next Story